Hair Problems: చింతపండును తీసిపారేయకండి.. జుట్టు సమస్యలను పారదోలుతుంది
ఎన్నో ప్రయోజనాలు Home Remedies For Hair Problems: జుట్టు సమస్యలకు చింతపండు చక్కటి పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి చింతపండును ఎలా వినియోగిస్తారో తెలుసుకోండి.
చింతపండులో పోషకాలు Home Remedies For Hair Problems: జుట్టు సంరక్షణకు చింతపండు కీలక పాత్ర పోషిస్తుంది. చింతపండు రసంలోని గుణాలు జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న చింతపండు జుట్టు సమస్యలను నివారిస్తుంది.
సమస్యలకు చెక్ Home Remedies For Hair Problems: చుండ్రు.. పేళ్లు వంటి సమస్యకు చింతపండు రసం నివారిస్తుంది. చింతపండులోని విటమిన్ సీ తలను శుభ్రం చేస్తుంది. చింతపండును రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే బాగా కలిపి చింతపండు రసాన్ని జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రమైన నీటితో తల స్నానం చేయండి.
మృదువైన జుట్టు Home Remedies For Hair Problems: చింతపండు రసంతో జుట్టును మృదువుగా మార్చుకోవచ్చు. ఒక గిన్నెలో చింతపండు రసం తీసుకుని దానిలో కలబంద రసం వేసి కలపండి. అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. కొన్ని నిమిషాల తర్వాత షాంపూతో జుట్టును కడగాలి.
జుట్టు పెరుగుదల Home Remedies For Hair Problems: చింతపండు రసం జుట్టు పెరుగుదలకు బాగా పనిచేస్తుంది. చింతపండు రసాన్ని క్రమంగా జుట్టుకు పట్టిస్తుంటే తల భాగానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ కారణంగా జుట్టు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది.
జుట్టు రాలడం: ఈ సమస్యతో బాధపడుతుంటే చింతపండు రసం వాడితే సమస్య తగ్గుతుంది. చింతపండు రంసంలోని యాంటీఆక్సిడెంట్లు, జింక్, ఐరన్ జుట్టును మూలాల నుంచి బలపరిచి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.