Honda Activa EV 2025: రూ.80 వేలకే ఎలక్ట్రిక్ Honda Activa స్కూటర్.. ఫీచర్స్, ఫుల్ డిటెయిల్స్ ఇవే!
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా తమ కొత్త యాక్టివా 110 విడుదల చేసింది. ఇది గత మోడల్‌ను అప్‌గ్రేడ్ చేసి లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ హోండా యాక్టివా 110 ఎలక్ట్రిక్ వేరియంట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక హోండా యాక్టివా 110 స్కూటర్ ధర వివరాల్లోకి వెళితే.. దీని ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 80,950 నుంచి లభించబోతోంది. ఈ స్కూటర్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ను కంపెనీ ఆటో ఎక్స్‌పోలో వెల్లడించింది.
ఈ స్కూటర్‌లోని DLX వేరియంట్ ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని ప్రీమియం వేరియంట్ H-స్మార్ట్ పేరుతో విడుదల కాబోతోంది. ఈ స్కూటర్స్ మొత్తం ఆరు కలర్ ఆప్షన్స్‌తో పాటు మూడు కలర్ వేరియంట్స్‌లో లాంచ్ కాబోతోంది.
కొత్త యాక్టివా 110 స్కూటర్ ప్రత్యేకమైన కొత్త 4.2-అంగుళాల TFT డిస్ప్లేతో లాంచ్ కానుంది. అంతేకాకుండా USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ సెటప్ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు స్పెషల్ బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది.
అలాగే ఈ స్కూటర్‌లో ఉన్న డిస్ల్పేలో హోండా రోడ్‌సింక్ యాప్‌తో సహాయంతో కాల్ అండ్ నోటిఫికేషన్స్ కూడా పొందవచ్చు. దీంతో పాటు ట్రాఫిక్ లాంటి ప్రదేశాల్లో ఈ స్కూటర్‌ను ఇంధన సామర్థ్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేకమైన ఐడలింగ్ స్టాప్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది.
ఈ పవర్ ఫుల్ యాక్టివా 110 స్కూటర్ 109.51cc సింగిల్-సిలిండర్ ఇంజన్ సెటప్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా ఈ ఇంజన్ 9.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్లు కూడా హోండా కంపెనీ ప్రకటించింది. అయితే ఈ స్కూటర్ త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.