Honda Elevate SUV: హోండా నుండి కతర్నాక్ ఎలివేట్ SUV కారు వచ్చేసింది..

Mon, 04 Sep 2023-7:14 pm,

Honda Elevate SUV Price and Specs: వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో వస్తోన్న హోండా ఎలివేట్ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ SUV ప్రియులను ఆకట్టుకునేలా ఉంది.

Honda Elevate SUV Price and Specs: హోండా ఎలివేట్ SUV టాప్ ఫీచర్స్‌లో 17-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటో-డిమ్మింగ్ రియర్‌వ్యూ మిర్రర్ ఉన్నాయి. 

Honda Elevate SUV Price and Specs: ఇవే కాకుండా డ్యాష్‌బోర్డ్‌పై సాఫ్ట్-టచ్ ఫినిషింగ్‌తో బ్రౌన్ లెథెరెట్ అప్‌హోల్‌స్టరీ వైర్‌లెస్ కనెక్టివిటీతో 8 స్పీకర్లను అనుసంధానం చేస్తూ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Honda Elevate SUV Price and Specs: హోండా ఎలివేట్ SUV కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, స్పీడ్ వార్నింగ్, పార్కింగ్ సెన్సార్లు, లేన్-కీప్ అసిస్టెన్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ - ADAS ఫీచర్స్ కస్టమర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.

Honda Elevate SUV Price and Specs: హోండా ఎలివేట్ SUV కారు కొనేవారికి మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ కారుతో హోండా కంపెనీ నుండి 3 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీ లభిస్తోంది.

Honda Elevate SUV Price and Specs: అంతేకాదు.. కారు కొనుగోలు తేదీ నుండి 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ, 10 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్‌ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది.

Honda Elevate SUV Price and Specs: ఇండియన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే హోండా ఎలివేట్ SUV కారును డిజైన్ చేసినట్లు హోండా కార్స్ ఇండియా అభిప్రాయపడింది.

Honda Elevate SUV Price and Specs: హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి SUV కార్లకు హోండా ఎలివేట్ కారు గట్టి పోటీ ఇవ్వనుంది.

Honda Elevate SUV Engine Specs: హోండా ఎలివేట్ SUV కారు 1.5-లీటర్ DOHC i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది. 119 bhp శక్తిని, 145.1 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం హోండా ఎలివేట్ కారు సొంతం.

Honda Elevate SUV Mileage: హోండా ఎలివేట్ SUV కారు 15.31kmpl మైలేజీని అందిస్తుందని హోండా కార్స్ ఇండియా స్పష్టంచేసింది. హోండా ఎలివేట్ మాన్యువల్ వేరియంట్‌ కారు 15.31kmpl మైలేజీ, హోండా ఎలివేట్ ఆటోమేటిక్ వేరియంట్‌ 16.92kmpl మైలేజీని అందిస్తుందని హోండా కార్స్ ఇండియా వెల్లడించింది.

Honda Elevate SUV Prices : హోండా ఎలివేట్ కార్ల ఎక్స్-షోరూం ధరలు విషయానికొస్తే.. ఈ కారు బేసిక్ వేరియంట్ ధరలు రూ. 10,99,900 నుంచి మొదలైతే.. టాప్ ఎండ్ వేరియంట్ కారు ధర రూ. 16 లక్షల వరకు ఉంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link