Honey Rose Photos: జక్కన్న చెక్కిన శిల్పమా..? హనీ రోజ్ అందాల ఆరబోతను ఆపతరమా..?

బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి సినిమాతో ఒక్కసారిగా హనీ రోజ్ అందాలకు గిరాకీ పెరిగింది. అంతకు ముందు ఎప్పుడో హనీ రోజ్ తెలుగు సినిమా చేసింది. కానీ అప్పుడు హనీ రోజ్‌కు ఇంత గుర్తింపు రాలేదు.

మాలీవుడ్‌లో హనీరోజ్ చాలా సినిమాలే చేసింది. కానీ వీర సింహా రెడ్డితో వచ్చినంత క్రేజ్ మరే సినిమాతోనూ ఆమెకు రాలేదు. మోహన్ లాల్‌తో చేసిన సినిమాతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే.
బాలయ్య పక్కన రొమాంటిక్ పాత్ర చేయడంతో హనీ రోజ్ ఎక్కువగా ఫేమస్ అయింది. సినిమాలో అందాలను ఆరబోయడం ఒకెత్తు అయితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె చూపించిన ఒంపుసొంపులు ఇంకో ఎత్తు.
హనీరోజ్ అందాలకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగానే క్రేజ్ పెరిగింది. ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయినా, రెస్టారెంట్ ఓపెనింగ్ అయినా కూడా ఆమెనే కనిపిస్తోంది. ఇలా రెండు చేతులా ఆమె బాగానే సంపాదించేస్తోన్నట్టుగా కనిపిస్తోంది.
హనీ రోజ్ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఆమె వయ్యారాలను చూపించిన తీరు చూస్తుంటే.. జక్కన్న చెక్కిన శిల్పమా? అనేలా ఉంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.