Honey Rose: రెడ్ ట్రెండ్ ని ఫాలోఅయిన హనీ రోజ్.. కానీ కొంచెం డిఫరెంట్ గా!
Honey Rose Viral Pics: హనీ రోజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ హీరోయిన్.
వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ కన్నా కూడా హనీ రోజ్ ఎక్కువ పేరు సంపాదించుకుంది. ఆలయం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ వీర సింహారెడ్డితో అందరినీ ఫిదా చేసింది.
2005లో మలయాళంలో విడుదలైన 'బాయ్ ఫ్రెండ్' సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఈ హీరోయిన్.
ఆ తరువాత మలయాళం తో పాటు తెలుగు, తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా, వీరసింహారెడ్డి చిత్రాలలో నటించిన ఈ హీరోయిన్ కి వీర సింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అందించింది.
అప్పటినుంచి అన్ని రోజుకి సోషల్ మీడియాలో తెలుగు ప్రేక్షకులు దగ్గర నుంచి కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది.
ప్రస్తుతం వాలెంటైన్స్ వీక్ సందర్భంగా సెలబ్రిటీలు అందరూ రెడ్ డ్రెస్ లో కనిపిస్తుండగా హనీ రోజ్ కూడా రెడ్ డ్రెస్సులో కనిపించి అందరిని అలరిచ్చింది. అయితే కొంచెం డిఫరెంట్ గా మోడరన్ రెడ్ డ్రస్సుకి ట్రెడిషనల్ నగలు పెట్టుకొని ఆకట్టుకుంది ఈ హీరోయిన్.