Salt: ఇంట్లో ఉప్పుతో ఇలా చేస్తే.. లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్లమన్నా వెళ్లదు..
![నెగిటివ్ ఎనర్జీ Salt Remove Negativity](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Saallt5.jpg)
ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే కిటికి లేదా డోర్ల వద్ద ఓ గాజు గ్లాసు లేదా బౌల్‌లో రాళ్ల ఉప్పు వేసి పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి దరిదాపుల్లోకి రావు.
![ఇంట్లోకి పాజిటివిటీ Salt For Positivity](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Saallt3.jpg)
అంతేకాదు ఉప్పు ఇంటిని శుభ్రం చేసినప్పుడు బకెట్ నీటిలో వేసి శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివిటీ పెరుగుతుంది. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధల నుంచి త్వరగా బయటపడతారు.
![ఉప్పు స్నానం Salt Bath](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Saallt4.jpg)
మీరు స్నానం చేసినప్పుడు కూడా ఆ నీటిలో ఉప్పు వేసి స్నానం చేయాలి. మీపై ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాదు బాడీ పెయిన్స్ కూడా క్రమేణా తగ్గిపోతాయి.
మీకు రాత్రిపూట ఏవైనా పీడకలలు వచ్చి బాగా ఇబ్బంది పడుతుంటే కూడా ఉప్పు ఎఫెక్టీవ్ రెమిడీ. ఓ చిన్న బ్యాగ్ లో ఉప్పు వేసి తలదిండు కింద పెట్టి పడుకోండి. ఉప్పు వేడినీటిలో వేసి అందులో మీ పాదాలను కాసేపు నానబెట్టండి మీలో నెగిటివిటీ తగ్గిపోతుంది.
ఉప్పును ఓ గాజు పాత్రలో నీళ్లలో వేసి ఇంటి నైరుతి మూలలో పెడితే ఇంట్లో ఉన్న అప్పులు తొలగిపోతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆ ఇంట్లో సుకః శాంతులు వెల్లివిరుస్తాయి. ఉప్పు ఇంట్లో వాస్తు దోషానికి కూడా చెక్ పెడుతుంది.