PM Svanidhi Yojana: పే స్లిప్‎తో పనిలేదు.. సిబిల్‎తో అవసరం లేదు.. ఈ ఒక్క కార్డు ఉంటే చాలు.. 50,000లోన్ పక్కా

Wed, 08 Jan 2025-8:55 pm,

PM Svanidhi Yojana: నేటి కాలంలో చాలా మంది లోన్ తీసుకుంటున్నారు. ఏదో ఒక రూపంలో లోన్ తీసుకున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే చాలామందికి అవసరాలు ఉన్నాయి. అవసరాలను తీసుకోవడానికి లోన్ తీసుకుంటున్నారు. అయితే లోన్ తీసుకోవాలంటే ఏదో ఒక గ్యారెంటీ అవసరం ఉంటుంది. కానీ ఈ లోన్ కి ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. ఈరోజుల్లో గ్యారెంటీ లేకుండా లోన్ ఇవ్వరు. వ్యాపారం చేసిన అదే పరిస్థితి ఉంటుంది. కానీ కేంద్రం సాధారణ, మధ్యతరగతి, పేద ప్రజలను ఆదుకునేందుకు పీఎం స్వనిది యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా చిరు  వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసాన్ని కల్పించవచ్చు. ఎలాగో తెలుసుకుందాము.  

నిజానికి ఈ స్కీము 2020లో ప్రారంభించారు. కోవిడ్ 19 కారణంగా ప్రభావితమైన చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు 50 వేల వరకు లోన్స్ అందించడం ద్వారా ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు అవసరం. దీన్ని ఆన్లైన్లో లేదా స్థానిక సేవా కేంద్రాలలో సమర్పించవచ్చు.  

 ఈ స్కీం కింద లబ్ధిదారులు గ్యారెంటీ లేకుండా ఆధార్ కార్డుతో లోన్ పొందవచ్చు.  లోన్ మొదట్లో వ్యాపారులకు పదివేల వరకు ఇస్తారు. ఈ లోన్ సమయానికి తిరిగి చెల్లించినట్లయితే మరో లోన్ రూపంలో 20వేల వరకు పొందవచ్చు. అంతేకాకుండా ఈ లోను సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే ఆ తర్వాత మొత్తం 50 వేల రూపాయలకు పెంచుతారు.  

అయితే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. పీఎం స్వనిధి యోజన పథకం కింద లోన్ పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. వ్యాపారులు ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వ బ్యాంకులో ఈ స్కీము కోసం అప్లయ్ చేసుకోవచ్చు.  రుణాన్ని 12 నెలల వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చు.  

 పీఎం స్వనిధి యోజన అనేది వెబ్సైట్ ప్రకారం లోన్ తీసుకునేవారు తప్పనిసరిగా లోన్ అప్లికేషన్ ఫారంని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఈ కేవైసీ ఆధార ధ్రువీకరణ కోసం మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ కి లింక్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు పట్టణ, స్థానిక సంస్థల నుంచి సిఫార్సు లేఖను కూడా అవసరాన్ని బట్టి పొందాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.  

ఈ లోను తీసుకోవాలంటే రుణ గ్రహీతకు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి.  గరిష్ట వయస్సు మారవచ్చు. చాలామంది రుణ దాతలు కనీసం 25వేల నికర  ఆదాయాన్ని అంగీకరిస్తారు. కానీ ఇది మారుతుంది  

ఈ లోనుకు దరఖాస్తు చేసుకోవాలంటే నేరుగా పోర్టల్ లో లేదా ప్రాంతానికి దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  

షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులో వడ్డీ రేట్లు ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం ఉంటాయి . NBFC, NBFC, MFIలు మొదలైన వాటి కోసం వడ్డీ రేట్లు సంబంధిత రుణదాత వర్గానికి ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయి. ఎంఎఫ్ఐలు, ఆర్బీఐ మార్గదర్శకాల పరిధిలోకి రాని ఇతర రుణదాత వర్గాలకు ఎన్ బీఎఫ్ సీ, ఎంఎప్ఐల కోసం ప్రస్తుతం ఉన్న ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం స్కీం కింద వడ్డీరేట్లు వర్తిస్తాయి. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link