BSNL 4G: మీ ప్రాంతంలో BSNL నెట్‌వర్క్ ఎంత స్పీడ్ ఉంది? ఇలా చిటికెలో తెలుసుకోండి..
BSNL Network Near you: పెరిగిన టెలికాం ఛార్జీల వల్ల చాలామంది ఇతర కంపెనీలకు పోర్ట్ అవుతున్నారు. అలాగే జియో, ఎయిర్‌టెల్ తో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్ కు మారుతున్నారు. ఈ సందర్భంగా మీరు కూడా ఈ ఆలోచనలోనే ఉంటే ముందుగా మీ ఏరియాలో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ స్పీడ్ ఉందా? లేదా? ఇలా చెక్ చేసుకోండి.
మన ఫోన్ హ్యాండ్ సెట్‌లో రేడియో ట్రాన్స్‌మీటర్ ఉంటుంది. వీటి ద్వారా సిగ్నల్స్ ఇతర ఫోన్లకు చేరతాయి. ఇవి తక్కువ దూరంలోనే ప్రయాణిస్తాయి. అందుకే మీ దగ్గర్లో బేస్ స్టేషన్ ఉందా? తెలుసుకోవాలి. దీన్ని సెల్ అని కూడా పిలుస్తారు. వీటి ద్వారా సిగ్నల్స్ అన్ని ఫోన్లకు వెళ్తాయి. బీఎస్‌ఎన్‌ఎల్ 2G/3G/4G అందుబాటులో ఉన్నాయి.
బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ చెక్ చేసే విధానం.. ముందుగా Https://tarangsanchar.gov.in/emfportal ఓపెన్ చేయాలి ఆ తర్వాత అందులో My Location ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
ఆ వెంటనే ఒక స్క్రీన్ కనిపిస్తుంది. అందులో మీ పేరు, ఇమెయిల్, మొబైల్ నంబర్ దాని కింద ఓ క్యాప్చా వస్తుంది. అది ఎంటర్ చేయాలి.
చివరగా Send me a mail with OTP పై క్లిక్ చేయాలి ఆ తర్వాత ఓటీపీ నమోదు చేస్తే మీకు అన్ని సెల్ టవర్స్ కనిపిస్తాయి.