EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు
EPFO Balance Check Online: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. 2019-20 ఏడాదికి సంబంధించిన 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేశారు. దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO Latest News), ఈపీఎఫ్ ఖాతాదారులు తమ వివరాలు చెక్ చేసుకోవాలని భావిస్తున్నారు. 4 విధానాలలో ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
Also Read: EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం
ఆన్‌లైన్‌లో EPF Balance తొలుత http://epfindia.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఈ పాస్‌బుక్ మీద క్లిక్ చేయండి అక్కడ మీ వివరాలు నమోదు చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది మెంబర్ ఐడీ వివరాలు సబ్మిట్ చేస్తే ఈపీఎఫ్ బ్యాలెన్స్(PF Balance) వివరాలు కనిపిస్తాయి.
Also Read: EPFO: 40 లక్షల మంది EPF ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్
SMS ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్
మీ పీఎఫ్ అకౌంట్, బ్యాంక్ ఖాతాలకు ఒకే నెంబర్ ఉండి.. ఆ నెంబర్‌ను ఈపీఎఫ్ఓలో అప్‌డేట్ చేసి ఉంటే మీ మొబైల్ నెంబర్‌కు తరచుగా పీఎఫ్ వివరాలు అందుతుంటాయి. లేకపోతే EPFOHO UAN అని టైప్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899కు మెస్సేజ్ చేయాలి. దాంతో మీ నెంబర్‌కు పీఎఫ్ వివరాలు అందుతాయి.
Also Read: EPFO: మరోసారి తగ్గనున్న PF Interest Rate, మోదీ ప్రభుత్వంలో వడ్డీ రేట్లు ఇలా మారాయి
మిస్డ్ కాల్ ద్వారా EPF Balance Check.. ఈపీఎఫ్ఓ ఖాతాదారులు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఫోన్‌కు వస్తాయి. యూఏఎన్ నెంబర్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈపీఎఫ్ వివరాలు వెంటనే మీ రిజిస్టర్ మొబైల్‌కు పంపిస్తారు.
Also Read: EPFO: ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త PF Tax Rules, దీని ప్రభావం ఇలా ఉండనుంది
UMANG Appలో ఈపీఎఫ్ ఖాతా వివరాలు ఇలా తెలుసుకోవచ్చు.. - పీఎఫ్ ఖాతాదారుడు మొదట UMANG App ఓపెన్ చేయండి
- తర్వాత ఈపీఎఫ్ఓ మీద క్లిక్ చేయండి
- Employee Centric Services మీద క్లిక్ చేయాలి
- View Passbook ఆప్షన్‌ను క్లిక్ చేయండి
- మీ UAN నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి
- పీఎఫ్ ఖాతాకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది
- ఓటీపీ కన్ఫామ్ చేసిన తర్వాత మీరు ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు
Also Read: EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను UMANG Appలో ఈజీగా చెక్ చేసుకోండి