Kisan samman nidhi: కిసాన్ సమ్మాన్ నిధి 8వ విడతలో..మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి

కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా ఇప్పటి వరకూ 7 విడతల్లో రైతుల ఖాతాల్లో నగదు బదిలీ అయింది. ఇప్పుడు 8వ విడత కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిది గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి యేటా 4 నెలల కోసారి ఏడాదిలో మూడుసార్లు రెండేసి వేల చొప్పున కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంటుంది.

pmkisan.gov.in ప్రకారం ఇప్పటి వరకూ 11 కోట్ల 26 లక్షల పైచిలుకు రైతులకు ఈ పథకం కింద లబ్ది చేకూరింది. మోదీ ప్రభుత్వ ఈ పథకాన్ని 2018 డిసెంబర్ 1న ప్రారంభించింది. అప్పట్నించి లబ్దిదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో పంపిస్తారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2020 డిసెంబర్ నుంచి 2021 మార్చ్ వరకు మొత్తం 9 కోట్ల 64 లక్షల 9 వేల 263 రుపాయలు కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు అందింది.
pmkisan.gov.in ప్రకారం గత యేడాది ఆగస్టు నుంచి నవంబర్ మధ్య కాలంలో పది కోట్ల 21 లక్షల 35 వేల 267 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయింది. కానీ డిసెంబర్ నుంచి మార్చ్ మధ్య కాలంలో ఈ సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే తప్పుడు సమాచారంతో లబ్దిదారులగా చేరినవారి పేర్లు తొలగించారు.
కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాన్ని కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చి తీసుకున్నారు. ఈ అందరిదీ మరోసారి వెరిఫికేషన్ జరుగుతోంది. ఎవరైతే తప్పుడు సమాచారంతో నమోదు చేయించుకున్నారో వారి నుంచి ప్రభుత్వ డబ్బులు వెనక్కి తీసుకోనున్నారు. చర్యలు కూడా తీసుకునే అకాశముంది. దర్యాప్తు తరువాత నకిలీ లబ్దిదారుల పేర్లు తొలగిస్తారు. సో మీరు pmkisan.gov.in విజిట్ చేసి..మీ ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్ ద్వారా మీ స్టేటస్ తెలుసుకోవచ్చు.