WhatsApp: ప్రైవసీ పాలసీ నచ్చలేదా.. మీ వాట్సాప్ అకౌంట్ ఇలా డిలీట్ చేసుకోండి

ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకురానుంది. అయితే తమ డేటా మొత్తం తీసుకెళ్లి దాని మాతృసంస్థ ఫేస్‌బుక్(Facebook)కు ఇవ్వనున్నట్లు కొత్త పాలసీలో స్పష్టం చేసింది. దీంతో వాట్సాప్ వినియోగదారులు సంస్థ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తమ సమాచారాన్ని వాడుకుంటామని చెప్పే యాప్ మాకెందుకు అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే కొందరు నెటిజన్లు టెలిగ్రామ్ ఇన్‌స్టాల్ చేసి వాడుతుండగా.. తాజాగా సిగ్నల్ యాప్ డౌన్‌లోడ్స్ పెరిగిపోతున్నాయి. కొందరు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మరికొందరు నెటిజన్లు వాట్సాప్(WhatsApp) ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేసిస్తున్నారు.
Also Read: Credit Card Tips: ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేయాలంటే ఇలా చేయండి. - మొదట మీ వాట్సాప్ యాప్ ఓపెన్ చేయాలి. - అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆపై అకౌంట్(Account) ఆప్షన్ మీద క్లిక్ చేయండి
- పేజీ ఓపెన్ అయ్యాక.. అందులో డిలీట్ మై అకౌంట్ మీద క్లిక్ చేయాలి. - ఆ తర్వాత సూచనల మేరకు మీరు వాట్సాప్ వాడుతున్న మొబైల్ నెంబర్‌ను అంతర్జాతీయ ఫార్మాట్(+91)లో టైప్ చేసి డిలీట్ మై అకౌంట్‌పై క్లిక్ చేస్తే.. పర్మనెంట్‌గా మీ వాట్సాప్ అకౌంట్ డిలీట్ అవుతుంది.
Also Read: EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి
మీ వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేస్తే మీ చాటింగ్ హిస్టరీ మొత్తం డిలీట్ అవుతుంది. మీరు భాగస్వాములు అయి ఉన్న వాట్సాప్ గ్రూప్‌ల నుంచి సైతం రిమూవ్ అవుతారు. ఇప్పటివరకూ మీరు చేసిన గూగుల్ బ్యాకప్ డేటా సైతం డిలీట్ అయిపోతుంది.
Also Read: EPFO: పీఎఫ్ నగదు విత్‌డ్రా చేస్తున్నారా.. ఈ తప్పులు అసలు చేయవద్దు!