Currency Notes: కస్టమర్లకు ఊరట.. చిరిగిన నోట్ల విషయంలో ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే
Torn Notes: ATM ద్వారా డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు లేదా షాపింగ్ చేసేటప్పుడు చాలా సార్లు పాత లేదా చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఈ నోట్లను మార్పిడి చేయడం కష్టంగా మారుతుంది. ఈ ఇలాంటి మీకు కూడా ఎదురైతే..ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మీరు ఈ నోట్లను బ్యాంకులో చాలా సులభంగా మార్చుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నోట్ల మార్పిడికి సంబంధించి చాలా కఠిన నిబంధనలను రూపొందించింది. ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకు నిరాకరించకూడదని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. అయితే, చిరిగిన నోట్లకు సంబంధించి బ్యాంకు కొన్ని నిబంధనలను కూడా రూపొందించింది. ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చెరిగిన నోట్లను ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు: చిరిగిన నోట్లను ఇకపై ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి. వినియోగదారులు ప్రభుత్వ బ్యాంకు శాఖలు, ప్రైవేట్ బ్యాంక్ కరెన్సీ చెస్ట్ బ్రాంచ్‌లు లేదా ఆర్‌బిఐ ఇష్యూ కార్యాలయంలో ఎలాంటి ఫారమ్‌ను పూరించకుండానే నోట్లను మార్చుకోవచ్చు. ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులు ఇకపై నిరాకరించలేవు.
ఏటీఎంలో చెరిగిన నోట్లు వస్తే బాధ్యత బ్యాంకులదే: ఏటీఎంలో వచ్చే చిరిగిన నోట్ల బాధ్యత కూడా బ్యాంకులదేనని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసే ఏజెన్సీకి కూడా నోట్లను తనిఖీ చేసే బాధ్యత లేదని స్పష్టం చేసింది. కరెన్సీ నోటులో ఏదైనా లోపం ఉంటే, దానిని బ్యాంకు ఉద్యోగి మాత్రమే తనిఖీ చేయాలి. ఏదైనా నోటు పాడైపోయినా, చిరిగిపోయినా కస్టమర్ ఏ బ్యాంకు ఎటిఎం నుండి పొందాడో ఆ బ్యాంకు శాఖకు వెళ్లి కరెన్సీ నోటును మార్చుకోవచ్చు.
నోట్ల మార్పిడి పరిమితి ఖరారు: ఆర్‌బీఐ నిబంధనలలో నోట్ల మార్పిడి పరిమితిని కూడా ఖరారు చేశారు. నిబంధనల ప్రకారం, ఒకేసారి 20 నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. ఈ నోట్ల విలువ రూ. 5000 మించకూడదు. 20 కంటే ఎక్కువ చిరిగిన నోట్లు ఉంటే, ఫైన్ వసూలు చేస్తారు.
కాలిపోయిన నోట్లను మార్చడం సాధ్యం కాదు: సీరియల్ నంబర్, మహాత్మా గాంధీ వాటర్‌మార్క్ , గవర్నర్ ప్రమాణం కనిపిస్తూ చిరిగిన నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. అయితే, బాగా కాలిపోయిన, నీటి నానిన నోట్లను మార్చడం సాధ్యం కాదు. అలాంటి నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ కార్యాలయంలో మాత్రమే మార్పిడి చేసుకోవచ్చు. ఎవరైనా బ్యాంక్ నోట్‌ని మార్చుకోవడానికి నిరాకరిస్తే, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం మీకు ఉంది. అటువంటి పరిస్థితిలో, ఆ బ్యాంకుపై రూ. 10,000 వరకు జరిమానా కూడా విధించవచ్చు. ఇదిలా ఉంటే ఏటీఎంలో లభించే దొంగ నోట్ల విషయంలో కూడా బ్యాంకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్బీఐ నిబంధనలో పేర్కొని ఉంది.