Selling Your Used Car: మీ పాత కారుకు మంచి ధర రావాలంటే ఏం చేయాలో తెలుసా ?

Wed, 20 Sep 2023-7:05 pm,

How to Get Best Price to Your Used Car: మీరు కారు కొన్నప్పటి నుండే ఈ విషయాలు మీ దృష్టిలో ఉంటే మీరు కారు అమ్మేటప్పుడు మీకు కచ్చితంగా సెకండ్ హ్యాండ్ కార్స్ మార్కెట్లో బెస్ట్ రేట్ వస్తుంది.

How to Get Best Price to Your Used Car: ఒక కారు ఇంజన్ పరంగా కానీ లేదా ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్స్ పరంగా కానీ కండిషన్‌లో ఉన్నప్పుడే ఆ కారుకు బెస్ట్ ప్రైస్ లభిస్తుంది. అలా ఉండాలంటే ఎప్పటికప్పుడు సర్వీసింగ్ షెడ్యూల్ ప్రకారం ఆయిల్ మార్పించడం, బ్రేక్స్ చెక్ చేయించడం, టైర్ రొటేషన్, రెగ్యులర్ వాషింగ్ చేయించాలి. అలాంటప్పుడే కారు కండిషన్ మాత్రమే కాదు.. లుక్ కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. కారును రెగ్యులర్ సర్వీసింగ్ చేయించినట్టుగా సర్వీస్ రికార్డు మెయింటెన్ చేయాలి.

How to Get Best Price to Your Used Car: ఇంజన్‌లో కానీ లేదా ఇతర సాంకేతిక లోపాలు కానీ ఏవైనా వాటిని వెంటనే రీపేర్ చేయించాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. 

How to Get Best Price to Your Used Car: కారు కొనేవారిలో చాలామంది ముందుగా చూసే అంశం మైలేజ్. ఎందుకంటే కారు కండిషన్‌లో ఉంటేనే మైలేజ్ బాగుంటుంది కనుక మైలేజ్ బాగుంది అంటే ఇక ఇంజన్ కండిషన్ కూడా ఢోకా ఉండదు అనే భావనలో ఉంటారు. అంతేకాకుండా మైలేజ్ తక్కువ ఇచ్చే వాహనాలను కొనడానికి ఎవ్వరూ ఇష్టపడరు కనుక వాటికి ధర కూడా ఎక్కువ రాదు.

How to Get Best Price to Your Used Car: కారును విచ్చలవిడిగా, అయినప్పుడు, కానప్పుడు వాడేయడం వల్ల కారు ఓడోమీటర్ కూడా ఎక్కువగా చూపిస్తుంది. ఇది మీ కారుకు ఎక్కువ ధర రానివ్వదు. అందుకే కారు వినియోగం అవసరాల మేరకే ఉండేలా చూసుకుంటే ఆ కారు కండిషన్ బాగుండటంతో పాటు మీటర్ రీడింగ్ కూడా తక్కువగా చూపిస్తుంది. చాలామంది ఓడోమీటర్ ట్యాంపరింగ్ చేయొచ్చు అని అనుకుంటారు కానీ నిశితంగా పరిశీలిస్తే కారును కొనే వారు ఆ విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

How to Get Best Price to Your Used Car: కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ( ఆర్సీ) , సర్వీస్ రికార్డ్స్, రశీదులు వంటివి జాగ్రత్తగా దాచిపెట్టాలి. కారును అమ్మే ముందు మీ ఆథరైజ్డ్ డీలర్ నుంచి కారు కండిషన్ గురించి ఒక సర్వీస్ హిస్టరీ రిపోర్ట్ తీసుకోవాలి. అది కారును కొనేందుకు ఆసక్తి చూపించేవారికి చూపిస్తే ప్రయోజనం ఉంటుంది.

How to Get Best Price to Your Used Car: ఆటోమొబైల్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం.. వేసవిలో కార్ల రీసేల్‌కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాంటి సమయంలో కారును రీసేల్‌కి పెడితే మంచి ధర పలికే అవకాశం ఉంటుంది.

How to Get Best Price to Your Used Car: మీ కారుపై ఏవైనా గీతలు లేదా డెంట్స్ వంటి కాస్మెటిక్ రీపేర్స్ ఉన్నట్టయితే.. వాటిని సరిచేయించండి. కారు లుక్ బాగుంటేనే కదా ఎవరైనా మంచి ధర పెట్టి కొనడానికి ముందుకొచ్చేది. అలాగే అదే సమయంలో కారుకి ఏవైనా యాక్సిడెంట్స్ జరిగి ఉంటే ఆ విషయాన్ని కూడా ముందుగా మీరే వెల్లడించండి. అది మీ పాత కారును కొనేవారిలో మీ మాటపై నమ్మకాన్ని పెంచుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link