PF Pension: మీరు 60ఏళ్లు పనిచేస్తే పెన్షన్ ఎంత వస్తుందో తెలిస్తే.. షాక్ అవ్వడం పక్కా

Sun, 24 Nov 2024-12:58 pm,
PF Pension:

PF Pension: ఉద్యోగస్థులు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొంత డబ్బు దాచుకుంటారు. ఈ అవసరాలను తీర్చేందుకుప్రభుత్వం పీపీఎఫ్ స్కీమును అందుబాటులోకి తీసువచ్చింది. ఈ స్కీమ్ ను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ స్కీములో ఏడాదికి రూ. 500 నుంచి రూ. 1.5లక్షల వరకు  పెట్టుబడి పెట్టవచ్చు. మీ సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి అమౌంట్ పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీము 7.1శాతం వడ్డీ లభిస్తుంది.   

Public Provident Fund Scheme

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ను ప్రధానంగా ఉద్యోగుల కోసం రూపొందిస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అందరికీ అందుబాటులో ఉంది. పీపీఎఫ్ 15ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. ఒకవేళ 60ఏళ్ల పాటు పనిచేస్తే..ఎంత పెన్షన్ వస్తుంది..ఈపీఎఫ్ఓ నిబంధనలు ఎలా ఉన్నాయో చూద్దాం.   

PF account is mandatory

భారతదేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ఏ వ్యక్తికైనా పీఎఫ్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. పీఎఫ్ ఖాతాకు కంపెనీ, ఉద్యోగి ఇద్దరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. పీఎఫ్ అకౌంట్ హోల్డర్ జీతంలో 12శాతం పీఎఫ్ అకౌంట్లో జమవుతుంది. అదే మొత్తాన్ని కంపెనీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. దీనిలో 8.33 శాతం పెన్షన్ ఫండ్ కు 3.67శాతం పీఎఫ్ అకౌంట్ కు జమ అవుతుంది.   

చాలా మందికి పీఎఫ్ అకౌంట్ హోల్డర్ 60ఏళ్లపాటు పనిచేస్తే ఎంత పెన్షన్ లభిస్తుందన్న సందేహం ఉంటుంది. ఈఫీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఎవరైనా పీఎఫ్ ఖాతాలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే అతను పెన్షన్ కోసం అర్హత  సాధిస్తాడు. 50ఏళ్లపాటు పెన్షన్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ అతను 58ఏళ్లలోపు పెన్షన్ క్లెయిమ్ చేస్తే అప్పుడు ప్రతి ఏడాది 4శాతం డిడక్షన్ ఉంటుంది. 

ఎవరైనా 54 ఏళ్ల వయస్సులో పెన్షన్ ను క్లెయిమ్ చేస్తే అప్పుడు 16శాతం డిడక్షన్ ఉంటుంది.  ఒకళవేళ 58ఏళ్ల తర్వాత కూడా పెన్షన్ క్లెయిమ్ చేయనట్లయితే 60ఏళ్ల వయస్సులో ప్రతిఏడాది 4శాతం ఇంక్రీస్ తో 8శాతం ఎక్కువ పెన్షన్ పొందుతారు. ఈపీఎఫ్ఓ ప్రస్తుత నియమల ప్రకారం 15వేల జీతం ఉన్నవాళ్లు పెన్షన్ అకౌంట్ కు కాంట్రిబ్యూట్ చేయవచ్చు.

పెన్షన్ గరిష్ట పరిమితి:  EPFO ​​ద్వారా నిర్దేశించిన ప్రస్తుత నిబంధనల ప్రకారం, పెన్షన్‌గా తీసుకోగల గరిష్ట జీతం పరిమితి రూ.15,000. అంటే మీరు ప్రతి నెలా మీ పెన్షన్ ఫండ్‌లో రూ. 15,000 x 8.33/100 = రూ. 1,250 డిపాజిట్ చేయవచ్చు.

పెన్షన్ లెక్కింపు ఫార్ములా:  పెన్షన్ లెక్కించినట్లయితే.. అది ఒక నిర్దిష్ట ఫార్ములా ద్వారా లెక్కిస్తారు. ప్రస్తుత పెన్షన్ 60 నెలల సగటు జీతం X సేవ పొడవును 70 ద్వారా విభజించడం ద్వారా లెక్కిస్తారు. సగటు వేతనం ఉద్యోగి  ప్రాథమిక వేతనం ఆధారంగా లెక్కిస్తారు. 

58 సంవత్సరాల వయస్సులో పెన్షన్ లభిస్తుంది:  మీరు 23 సంవత్సరాల వయస్సులో పని చేయడం ప్రారంభించి, 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసినట్లయితే, మీరు మొత్తం 35 సంవత్సరాలు పని చేసారు. ఈ దృష్టాంతంలో: సగటు ప్రాథమిక జీతం = రూ. 15,000 సేవా కాలం = 35 సంవత్సరాలు. ఈ సందర్భంలో, పెన్షన్‌గా నెలకు 15,000 x 35 / 70 = రూ. 7,500.

60 ఏళ్ల వయస్సులో పెన్షన్ అందుబాటులో ఉంటుంది:  మీరు 60 ఏళ్ల వయస్సులో పెన్షన్ క్లెయిమ్ చేస్తే, అదనంగా 8% పెరుగుదల ఉంటుంది. PF పెన్షన్  లెక్కింపు మీ గత 60 నెలల సగటు జీతంపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగ కాలం ఎంత ఎక్కువ ఉంటే మీ పెన్షన్ అంత ఎక్కువగా ఉంటుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link