Take home salary: ఇలా చేస్తే మీ టేక్ హోమ్ శాలరీ కచ్చితంగా పెరుగుతుంది..అదేంటో చూద్దామా
ఒకవేళ కొత్త వేతన నిబంధనల్లో ఈ కొత్త సూచనను పరిశీలిస్తే..టేక్ హోమ్ శాలరీ ఎక్కువగా ఉండాలనుకునేవారికి ఇది కచ్చితంగా గుడ్ న్యూస్. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.
కానీ కార్మిక శాఖ మరో సూచనను పార్లమెంటరీ సమావేశంలో ఇచ్చింది. ఈపీఎఫ్ వంటి పెన్షన్ ఫండ్‌ను ఇకముందు కొనసాగించడం కోసం ప్రస్తుతం ఉన్న స్ట్రక్చర్‌లో మార్పు సూచించింది. ఇందులో డిఫైండ్ బెనిఫిట్స్ స్థానంలో డిఫైండ్ కంట్రిబ్యూషన్స్ సిస్టమ్ అమలు చేయాలి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పెన్షన్ కనీస పరిమితి ఖరారైంది. ఓ విధంగా ఇది డిఫైండ్ బెనిఫిట్స్ మోడల్. డిఫైండ్ కంట్రిబ్యూటర్స్ సిస్టమ్ అవలంభించేందుకు పీఎఫ్ సభ్యులు వారి వాటాను ప్రకారమే లాభం ఉంటుంది.
వాస్తవానికి 2021 ఏప్రిల్ నుంచి ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే సిబ్బంది టేక్ హోమ్ శాలరీ తగ్గవచ్చు. ఎందుకంటే కంపెనీలకు కొత్త వేతన నిబంధనల ప్రకారం సిబ్బంది శాలరీ స్ట్రక్చర్‌లో మార్పు చేయాలి. కొత్త వేతన నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి అలవెన్స్ ..మొత్తం చెల్లింపులో 50 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఏప్రిల్ 2021 నుంచి ఉద్యోగుల బేసిక్ శాలరీ మొత్తం శాలరీలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది.
సాధారణంగా అధికశాతం కంపెనీలు ఉద్యోగుల శాలరీ నాన్ అలవెన్స్ భాగాన్ని 50 శాతం కంటే తక్కువ ఉంచుతాయి.తద్వారా ఈపీఎఫ్, గ్రాట్యుటీలో తక్కువ షేర్‌తో భారాన్ని తగ్గించుకోవచ్చని. కానీ కొత్త శాలరీ కోడ్ అమలైతే..కంపెనీలు బేసిక్ శాలరీని పెంచాల్సి వస్తుంది. దీంతో సిబ్బంది టేక్ హోమ్ శాలరీ తగ్గిపోతుంది. కానీ పీఎప్ షేర్, గ్రాట్యుటీ షేర్ పెరుగుతుంది. దాంతోపాటే సిబ్బంది ట్యాక్స్ పరిమితి కూడా తగ్గుతుంది. ఎందుకంటే కంపెనీ తన పీఎఫ్ షేర్‌ను సీటీసీ కింద జోడించేస్తుంది.
వాస్తవానికి కార్మిక శాఖ ..పార్లమెంటరీ సమావేశంలో ఈపీఎఫ్ ఫండ్‌లో ఉద్యోగులు, కంపెనీ ఇరువురి వాటాను 12 నుంచి 10 శాతానికి తగ్గించాలని సూచించింది. దీంతో సిబ్బంది వేతనంలో పెరుగుదల ఉంటుంది. కానీ పీఎఫ్‌లో షేర్ తగ్గిపోతుంది. పెన్షన్ కూడా తగ్గిపోతుంది.