Mosquitoes Removal Tips: వర్షాకాలంలో దోమలు, ఈగలు వేధిస్తున్నాయా, ఈ 5 చిట్కాలు పాటిస్తే దరిదాపుల్లో రావిక
పుదీనా అంటేనే అద్భుతమైన సువాసన. ఈగలకు ఈ వాసన అస్సలు పడదు. పుదీనా వానసకు దూరం పోతాయి. అందుకే వర్షాకాలంలో చిన్న చిన్న కుండీల్లో పుదీనా పెంచుకుంటే మంచిది. వీటిని కిటీకీలు, తలుపుల వద్ద ఉంచితే ఆ వాసనకు ఈగలు దరిచేరవు
సాధారణంగా వర్షాకాలంలో దోమలు, ఈగలు, బొద్దింకలు ఇతర కీటకాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంటుంది. వీటి వల్ల కేవలం అసౌకర్యమే కాకుండా వివిధ రకాల వ్యాధులు కూడా తలెత్తుతుంటాయి. ఆరోగ్యం పాడవుతుంది. వీటి నుంచి తప్పించుకునేందుకు 5 చిట్కాలున్నాయి.
దోమల్ని పారద్రోలేందుకు నిమ్మకాయ, లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ రెండింటి వాసన దోమలకు పడదు. ముందుగా నిమ్మకాయల్ని స్లైడ్స్ కింద కోసుకోవాలి. ప్రతి ఒక స్లైస్ లో 4-5 లవంగాలు ఉంచాలి. ఆ తరువాత వీటిని ఇంట్లో అక్కడక్కడా పెట్టుకోవాలి.
ఇంట్లోంచి దోమలు, ఈగల్ని పారద్రోలేందుకు వెల్లుల్లి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికోసం వెల్లుల్ని పేస్ట్ చేసుకుని నీళ్లలో ఉడికించాలి. ఆ తరువాత స్ప్రే బాటిల్ లో నింపుకుని ఇంట్లో మూలల్లో పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల దోమలు, ఈగలు పారిపోతాయి.
ఇక దోమల బెడద ఎక్కువగా ఉంటే మరో అద్బుతమైన చిట్కా ఉంది. సగం స్పూన్ విక్స్ తీసుుకుని అందులో కొద్దిగా బేకింగ్ సోడా కలపాలి. ఇప్పుడిందులో కొద్దిగా నీళ్లు వేసి మస్కిటో రీఫిల్ నింపుకోవాలి. అంతే రీఫిల్ వాడినట్టు వాడాలి. కాస్సేపట్లోనే ఆ వాసన కారణంగా దోమలు రాలి పడిపోతుంటాయి.
ఇక వర్షాకాలంలో ఎదురయ్యే మరో సమస్య బొద్దింకలు. ఇంట్లో కిచెన్ లో ఎక్కువగా కన్పిస్తాయి. వీటిని పారద్రోలేందుకు పలావు ఆకు ఉపయోగపడుతుంది. దీనికోసం 3-4 డ్రై పలావు ఆకులు తీసుకుని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ను బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో వేయాలి. ఈ వాసన పడక అవి దరిచేరవు