Hair Fall Remedy: జుట్టు రాలడం, వైట్ హెయిర్ సమస్యను నెల రోజుల్లో తగ్గించే ఆయిల్ ఇంట్లోనే తయారీ
ఇటీవలి కాలంలో జుట్టు రాలడం అంటే హెయిర్ ఫాల్ ప్రధాన సమస్యగా మారింది. మీక్కూడా ఇదే సమస్య ఉంటే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంట్లోనే ఉసిరి నూనె తయారు చేసుకుని వాడితే చాలా త్వరగా అంటే నెల రోజుల్లోనే ఫలితం కన్పిస్తుంది.
ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా కేశాలు కుదుళ్ల నుంచి పటిష్టంగా మారతాయి. డాండ్రఫ్ తగ్గిస్తాయి. త్వరగా జుట్టు నెరవకుండా చేస్తాయి. స్కాల్ప్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. రోజూ ఉసిరి నూనె రాయడం వల్ల మీ జుట్టు నిగనిగలాడటమే కాకుండా పటిష్టంగా మారుతుంది.
ఉసిరి నూనెను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. తాజా ఉసిరి, కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె, ఒక పాన్, గ్లాస్ బోటిల్ కావాలి.
ముందుగా పాన్‌లో కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె వేయాలి. మీరు ఎంత నూనె స్టోర్ చేసుకోవాలో అంత నూనె తీసుకోండి. ప్రారంభం కాబట్టి ఒక కప్పు నూనె తీసుకుంటే మంచిది. నూనెను స్లో ఫ్లేమ్‌లో వేడి చేయాలి. ఉడకకూడదు. అతిగా వేడి చేస్తే ఉసిరి, నూనెలోని పోషకాలు పోతాయి.
నూనె వేడెక్కిన తరువాత ఇందులో గ్రేడ్ చేసిన లేదా కట్ చేసిన ఉసిరి వేయాలి. లో ఫ్లేమ్‌లో వండనివ్వాలి. ఓ అరగంట అలా స్లో ఫ్లేమ్‌పై ఉంచాలి.
నూనె రంగు మారడం గమనించవచ్చు. ఉసిరి ముక్కలు కూడా రంగు మారతాయి. మద్య మధ్యలో కలుపుతుండాలి. లేకపోతే అడుగు అంటుకుంటుంది