Natural shampoo: ఇంట్లోఈ 3 వస్తువులు ఉంటే హెయిర్ షాంపూ అవసరమే ఉండదు..
అతిగా కెమికల్ ఉండే షాంపూలు వినియోగిస్తే హెయిర్ ఫాల్ సమస్యలు వెంటాడుతాయి. చర్మసంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అయితే ఇంట్లోనే కొన్ని వస్తువులు హెయిర్ షాంపూలా పనిచేస్తాయని మీకు తెలుసా?
ఉసిరికాయ, కుంకుడుకాయ,షీకాకయ్ మన అమ్మమ్మల కాలం నుండి తరతరాలుగా హెయిర్ షాంపూ చేయడానికి వినియోగిస్తారు. మనకు మార్కెట్లో ఈ ఉత్పత్తులు ఉండే హెయిర్ కేర్ షాంపూలు కూడా అందుబాటులో ఉంటాయి.షాంపూ లేని సమయంలో ఈ మూడింటిని కలిపి హెయిర్ షా షాంపుల వినియోగిస్తే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
దీనివల్ల హెయిర్ ఫాల్ సమస్యలు ఉండవు. చుండ్రు కూడా దరిచేరదు. అన్ని సూపర్ మార్కెట్లలో ఈ మూడు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఉసిరికాయ, కుంకుడకాయ పొడులు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో మనం షాంపూ తయారు చేసుకోవచ్చు. కుంకుడు కాయలు పగలకొట్టి ఉడకబెట్టి షాంపూలు తయారు చేసుకుంటారు.
అయితే రాత్రంతా వీటిని నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉడకబెట్టుకోవాలి నీటిలోనే మిగతా రెండు వస్తువులు కూడా వేసి కాసేపు చల్లారనివ్వాలి. వీటిలో నుంచి గుజ్జు బాగా పిసికి రసాన్ని తీస్తే షాంపూ లిక్విడ్ తయారవుతుంది. ఈ నీటితో హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు రాలే సమస్యను అధిగమించివచ్చు.
కుదుళ్ల నుంచి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు మీ జుట్టు ఆరోగ్యంగా మందంగా పెరుగుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )