Healthy Teeth Tips: పళ్లు అందంగా, ఆరోగ్యంగా మిళమిళలాడాలంటే ఈ అలవాట్లు మానేయాలి
సాఫ్ట్ డ్రింక్స్ అండ్ సోడా
సోడా, సాఫ్ట్ డ్రింక్స్‌లో యాసిడ్, షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దాంతో పంటి ఉపరితలం బలహీనమైపోతుంది. అంతేకాకుండా డార్క్ కలర్ డ్రింక్స్ తాగడం వల్ల పళ్లపై మచ్చలు ఏర్పడుతాయి. అందుకే వీటికి దూరంగా ఉంటే మంచిది
టీ అండ్ కాఫీ
టీ లేదా కాఫీ అనేది దేశంలో మెజార్టీ ప్రజలకు అలవాటు. ఇది లేకపోతే రోజు గడవదు. కానీ ఇందులో ఉండే ట్యానిన్ కారణంగా పళ్లపై మచ్చలు ఏర్పడతాయి. ఇవి పంటికి ఉండే తెలుపుదనాన్ని క్రమంగా తొలగిస్తాయి. దాంతో పసుపుగా మారిపోతాయి. రోజూ టీ లేదా కాఫీ తాగేవారిలో పళ్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే టీ లేదా కాఫీ తాగిన తరువాత కాస్సేపటికి నీటితో బాగా పుక్కిలించడం అలవాటు చేసుకోవాలి
స్వీట్స్ అండ్ చాకోలేట్స్
స్వీట్స్ అండ్ చాకోలేట్స్‌లో ఉండే షుగర్ బ్యాక్టీరియాను పెంచుతాయి. దాంతో కేవిటీ , పళ్లపై మచ్చలు ఏర్పడతాయి. ఎక్కువగా స్వీట్స్ తినకూడదు.
మసాలా , చట్నీ పదార్ధాలు
ఇండియాలో సాధారణంగా మసాలా పదార్ధాల వాడకం ఎక్కువ. ముఖ్యంగా పసుపు, ధనియాలు, చింతపండు కారణంగా పిగ్మంటేషన్ జరుగుతుంది. పళ్లపై మచ్చలు ఏర్పడతాయి. మసాలా ఎక్కువగా ఉండే పదార్ధాలు తినడం వల్ల పళ్లపై తెలుపు పోతుంది. పసుపుగా మారిపోతాయి.
రెడ్ వైన్
రెడ్ వైన్‌లో ట్యానిన్, యాసిడ్, డార్క్ కలర్ కారణంగా పిగ్మంటేషన్ అవుతుంది. పళ్లపై మచ్చలు ఏర్పడతాయి. అందుకే రెడ్ వైన్ అధికంగా సేవించేవారి పళ్లపై మెరుపు ఉండదు.