Get rid of mosquitoes: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. మీ ఇంట్లో ఉన్న దోమలన్ని పరార్..
వర్షాకాలం వచ్చిందంటే చాలు. చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురౌతుంటారు. ఈ కాలంలో దోమలు, ఈగల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి చెత్తకుప్పలు, దుర్గంధం ఉన్న ప్రదేశాలలో వాలుతుంటాయి. ఇవి వాలినటువంటి ఆహర పదార్థాలు తినడం వల్ల మన ఆరోగ్యం పూర్తిగా పాడౌతుంది.
మగ దోమలు చెట్లమీద వాలుతుంటాయి. ఇవి చెట్లలోని రసాలను స్వీకరిస్తాయి. కానీ ఆడదోమలు మాత్రం మనుషులను కుడుతుంటాయి. చేతులకు, కాళ్లకు, ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ కుట్టేసీ రక్తంను పీల్చేసుకుంటాయి.
దోమల కాటు ప్రభావం చిన్న పిల్లల్లో తొందరగా ఉంటుంది. డెంగ్యూ, చికెన్ గున్యా,మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు కల్గుతాయి. ప్లెట్ లెట్స్ కూడా పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
అందుకే వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. చెత్త కుప్పలు లేకుండా చూసుకొవాలి. సాయంత్రం కాగానే.. ఇంటి డోర్ లు, కిటీకీలను మూసేయాలి. కిటీకీలకు దోమతెరలు పెట్టుకొవాలి.
ఎండిన వేప ఆకులను ఇంట్లో కాల్చడం వల్ల ఆ పొగకు దోమలు పారిపోతాయి. లవంగాలను పొడిగా చేసుకుని, నిమ్మరసం కలపాలి. దీన్ని బాటిల్ లో చేసుకుని, కిటీకీలు, తలపుల మీద స్ప్రే చేయాలి.
పూదీనా, తులసీ, దాల్చిన చెక్కల మిశ్రమంలో స్ప్రేలాగా వాడిన కూడా దోమలు ఇంట్లోకి రావు. చిన్న పిల్లలకు దోమలు కుట్టకుండా ఒడోమాస్ పెట్టాలి. దోమతెరలను ఉపయోగించాలి. పడుకునే టప్పుడు తప్పకుండా, బెడ్ షీట్ లను కప్పుకొవాలి. దొమలు కుట్టి, దద్దుర్లు వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.