Business Ideas: ఇల్లు కదలకుండా కేవలం రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ. 50 వేలు పక్కా..!!
Small Business Ideas: ఈ బిజినెస్ కోసం మీరు ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. మీ రోజు వారీ పనుల్లో భాగంగానే కాస్త సమయం కేటాయిస్తే చాలు, మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కూడా ఈ బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. అలాంటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నర్సరీ బిజినెస్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీరు ఉంటున్న నివాస స్థలంలోనే కాస్త స్థలం కేటాయించి ఈ నర్సరీ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే, మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ నర్సరీ బిజినెస్ కోసం కావాల్సిన పెట్టుబడి అవసరమైన సామాగ్రి అలాగే స్ట్రాటజీ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తద్వారా మీరు ఈ బిజినెస్ లో లోతుపాతులను తెలుసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఒక అవగాహన కూడా ఏర్పడుతుంది.
నర్సరీ బిజినెస్ కోసం మీరు ఉంటున్న నివాస స్థలంలోనే కాస్త స్థలం కేటాయిస్తే సరిపోతుంది. 100 గజాల నుంచి 50 గజాల మధ్యలో మీరు స్థలం ఏర్పాటు చేసుకున్నట్లయితే, చక్కటి నర్సరీని ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు పెద్ద మొత్తంలో నర్సరీని ఏర్పాటు చేసుకోవాలనుకున్నట్లయితే, 200 గజాల స్థలంలో మీరు ఈ నర్సరీని ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా మీరు చక్కటి బిజినెస్ ఏర్పాటు చేసుకొని అవకాశం ఏర్పడుతుంది.
మీరు నర్సరీ ఏర్పాటు చేసిన అనంతరం మొక్కల్లో ఎక్కువగా ఇండోర్ మొక్కలను అందుబాటులో ఉంచితే మంచిది. వీటిని కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీటితో పాటు కూరగాయల మొక్కల విత్తనాలను కూడా అందుబాటులో ఉంచితే పెద్ద మొత్తంలో జనం కొనుగోలు చేస్తారు. అలాగే వీటితో పాటు సహజ ఎరువులను కూడా అందుబాటులో ఉంచితే మీకు మంచి వ్యాపారం లభించే అవకాశం ఉంది. వీటితోపాటు పూల కుండీలు హౌస్ గార్డెన్ సామాగ్రి కూడా విక్రయించినట్లయితే మీకు మంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.
నర్సరీ ఏర్పాటు ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి రోజుకు మీరు కొంత సమయం కేటాయిస్తే సరిపోతుంది పబ్లిసిటీ కోసం మీరు సోషల్ మీడియాను ఆశ్రయించడం ద్వారా కష్టమర్లను నేరుగా పొందవచ్చు.