Hair Fall Remedies: జుట్టు రాలుతోందా, పొడిబారుతోందా, ఈ పూల ఆయిల్ రాయండి
పూలలో ఔషధ గుణాలు
ఆయుర్వేద గుణాల ప్రకారం పూలలో అన్ని రకాల ఔషధ గుణాలు ఎక్కువ. ఇందులో ఎమైనా యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా రక్త సరఫరా మెరుగుపడుతుంది. కేశాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
మందార పూలు
మందారపూలలో ఎమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కేశాలు రాలడాన్ని నియంత్రిస్తాయి. మందారపూల రేకుల్ని ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక చెంచా పెరుగుతో కలిపి అప్లై చేయాలి. కేశాలకు రాసి 30 నిమిషాలుంచాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో కడగాలి
గులాబీ
గులాబి పూలలో యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. వీటి వల్ల స్కాల్ప్ పటిష్టంగా మారుతుంది. రోజ్ వాటర్ నీళ్లలో ఉడికించి గరగర చేయాలి. దాంతోపాటు రోజ్ వాటర్‌తో కండీషనర్ చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు రాలడం తగ్గుతుంది
మల్లెపూలు
గింగురు జుట్టు లేదా డ్రై జుట్టు ఉండేవారికి మల్లెపూల ఆయిల్ చాలా మంచిది. ఈ ఆయిల్ వాడటం వల్ల కేశాలు కుదుళ్లతో సహా పటిష్టంగా ఉంటాయి. పోషకాలు అద్భుతంగా అందుతాయి. జాస్మిన్ ఆయిల్‌లో విటమిన్ ఇ కలిపి జుట్టుకు రాసి 30 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు డ్రైనెస్ పోతుంది
కమలం పూలు
కమలం పూలు కూడా కేశాల ఆరోగ్యానికి చాలా ఉపయోగం. కమలం పూల ఆయిల్ తీసి కొబ్బరి నూనెతో కలిపి రాయాలి. ఓ అరగంట ఉంచి తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డ్రైనెస్ పోతుంది. కేశాలు బలంగా ఉంటాయి. జుట్టుకు నిగారింపు వస్తుంది.
బంతి పూలు
బంతి పూలు కేశాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి స్కాల్ప్ స్వెల్లింగ్ సమస్యను దూరం చేస్తాయి. కొబ్బరి నూనెలో బంతి పూల రేకులు కలిపి రాసి 30-40 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి