Chillis Storing Tips: పచ్చిమిర్చి ఎక్కువకాలంపాటు పాడవ్వకుండా ఉండాలంటే ఇలా నిల్వ చేయండి..
మన అందరి ఇళ్లలో పచ్చిమిర్చ కచ్ఛితంగా ఉంటుంది. వీటిని కారంపొడికి బదులుగా వాడతాం. పచ్చిమిర్చి మన డైట్లో చేర్చకోవడం వల్ల ఆరోగ్యపరంగా కూడా మంచిది. దీంతో బరువు కూడా సులభంగా తగ్గొచ్చని మనకు ఇది వరకే తెలుసు. అందుకే పచ్చిమిర్చిని డైట్లో చేర్చుకోవాలి అంటారు.
ఈరోజు మనం పచ్చిమిర్చి త్వరగా పాడవ్వకుండా ఎలా నిల్వ చేసుకోవాలో కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే పచ్చిమిర్చిని ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. అయితే, వీటి కాడలను తీసి నిల్వ చేసుకోవాలని గుర్తుంచుకోండి. లేకపోతే ఇవి వెంటనే ఎరుపు రంగులోకి మారిపోతాయి. మరికొన్ని కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
అంతేకాదు పచ్చిమిర్చిన ఎయిట్ టైట్ గాలిచొరబడని డబ్బాలో మాత్రమే నిల్వ చేసుకోవాలి. వీలైతే అందులో టిష్యూ పేపర్ కూడా పెట్టి పచ్చిమిర్చి నిల్వ చేసుకోవాలి. ముందుగా మార్కెట్ నుంచి పచ్చిమిర్చిని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని ఆరబెట్టాలి.
పచ్చిమిర్చిని నిల్వచేసే డబ్బాను కూడా నీరు లేకుండా శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత అందులో ఓ టిష్యూ పేపర్ వేసి దానిపై పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ డబ్బాను గాలిచొరబడకుండా మూత గట్టిగా పెట్టుకోవాలి. ఆ డబ్బాను ఫ్రిజ్లో నిల్వ చేసుకోవాలి. దీంతో పచ్చిమిర్చి ఎక్కువకాలం పాటు పాడవ్వకుండా నిల్వ ఉంటుంది.
పచ్చిమిర్చిని ముఖ్యంగా కొత్తిమీరాతో నిల్వ చేయకండి. ఎందుకంటే ఇది పచ్చిమిర్చిని త్వరగా పాడయ్యేలా చేస్తుంది. పచ్చిమిర్చిని నిల్వ చేసుకునేటప్పుడు అందులో కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి పచ్చిమిరపకాయలకు రుద్దితే కూడా ఎక్కువకాలంపాటు నిల్వ ఉంటాయి. ఇది కాకుండా కొద్దిగా నూనె తీసుకుని చేతులకు రుద్దుకుని పచ్చిమిర్చికి రుద్ది నిల్వ చేసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )