Hibiscus Plant Care: వర్షాకాలం ముందే మందార మొక్కకు ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి..
మీ ఇంటి గార్డెన్‌లో మందార పువ్వులు వర్షాకాలం రాక ముందే పూయడం మానేశాయా? అయితే, ఈ రోజు మనం మందార మొక్కకు పూలు పూయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఇలా చేయడం వల్ల మీ మందార మొక్క ఏడాది మొత్తం పూలు ఇస్తూనే ఉంటుంది.
మందార మొక్క ఆకులు వడలిపోతే వాటిని వెంటనే కట్ చేయండి. పసుపురంగులోకి మారిన ఆకులను కూడా వెంటనే తీసేయండి. మందార మొక్క మట్టిలో కూడా ఈ ఆకులు లేకుండా సరైన జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే ఇది వేరే ఆకులను కూడా దెబ్బతినేలా చేస్తుంది.
ముఖ్యంగా మందార మొక్కకు ఈ సమయంలో బయట ఎరువు కంటే ఇంట్లో తయారు చేసిన సహజసిద్ధమైన ఎరువులను వేయండి.. అంటే ఆవుపిడకలను నీళ్లలో నానబెట్టి ఆ నీటికి నాలుగింతల నీరు కలిపి పోయాలి. అంతేకాదు కూరగాయల తొక్కలతో తయారు చేసిన ఎరువులు కూడా మొక్కలకు వేయవచ్చు.
వర్షాకాలం రాకముందే కుండిలోని మట్టి వదులుగా ఉందా? లేదా? చెక్ చేయండి. ఎందుకంటే నీరు పోస్తే నేరుగా బయటకు డ్రెయిన్ అయిపోవాలి. నీటి నిల్వ ఉన్నా కూడా మొక్క చనిపోతుంది. వీలైతే మొక్క కుండి మార్చి చూడండి. దీంతో కూడా పూవులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి.
ముఖ్యంగా ఈ సీజన్లో మొక్కలు తెగుళ్ల బారిన పడే అవకాశం కూడా విపరీతంగా ఉంది. మొక్కలు పురుగు పట్టి ఉన్నాయా? అని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. లేదంటే అది మొక్క అంతటికీ వ్యాపిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)