WhatsApp Chat: మీ వాట్సాప్ ఛాటింగ్ డేటాను Telegram Appకు ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి
WhatsApp Chat History Transfer: టెలిగ్రామ్ ఇటీవల ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారుడు వారి వాట్సాప్ చాటింగ్ డేటాను టెలిగ్రామ్ యాప్‌నకు బదిలీ చేసుకోవచ్చు. iOS కోసం ఈ ఫీచర్ తీసుకొచ్చింది. 7.4 అప్‌డేట్ వెర్షన్‌ను టెలిగ్రామ్ అందించింది. తాజా ఫీచర్ ద్వారా WhatsApp, Line, KakaoTalk యాప్‌ల నుంచి ఛాటింగ్ డేటాను టెలిగ్రామ్‌కు పంపుకోవచ్చు. ఇలా డేటా బదిలీ చేసుకోవాలకున్న వారి మొబైల్‌లో సెండ్, రిసీవ్ యాప్స్ అప్‌డేట్ చేసి ఉంటేనే డేటా ట్రాన్స్‌ఫర్ సాధ్యపడుతుంది. త్వరలో ఆండ్రాయిడ్‌లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని టెలిగ్రామ్ యోచిస్తోంది.
Also Read: Jio Recharge Plans: మీకు అధికంగా డేటా కావాలా, Reliance Jio 5 బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే
మీ వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి. అందులో మీరు ఏ ఛాటింగ్‌ను టెలిగ్రామ్ యాప్(Telegram Latest Updates) ట్రాన్స్‌ఫర్ చేయాలో ఆ థ్రెడ్‌ను తెరవండి.
కాంటాక్ట్ ఇన్ఫో వద్దకు వెళ్లి, 'Export Chat' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోండి. మీరు మీడియా ఉన్నా లేకపోయినా చాట్‌లను బదిలీ చేసుకోవచ్చు చేయవచ్చు. ఇక్కడ మీకు కావలసిన ఛాటింగ్‌ను ఎంచుకోండి.
Also Read: SBI MF Retirement Benefit Scheme: మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ప్రారంభించిన SBI
అనంతరం మీరు మెను నుండి టెలిగ్రామ్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ మీ ఎవరి ఛాటింగ్‌ను ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నారో ఆ కాంటాక్ట్ నెంబర్ ఎంపిక చేయాలి.
ఇక్కడ మీరు Import అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తద్వారా మీరు సెలక్ట్ చేసుకున్న టెలిగ్రామ్‌కు మీ వాట్సాప్ ఛాట్ బదిలీ అవుతుంది.
Also Read: 7th Pay Commission: ఎల్‌టీసీ అలవెన్స్ చెల్లింపులపై 7వ వేతరణ సంఘం గుడ్ న్యూస్