Post Office Scheme: రూ. 1లక్ష పెడితే రూ. 2లక్షలు..బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్ ఇదే.. పూర్తి వివరాలివే
Post Office KVP Scheme: పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం కిసాన్ వికాస్ పత్రం. ఈ స్కీంలో వడ్డీ రేటు 6.9శాతం ఉంది. అంతేకాదు మనం పెట్టిన పెట్టుబడిపై చక్రవడ్డీ కూడా కలుపుతారు. తద్వారా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై రాబడి లభిస్తుంది. ఈ కిసాన్ వికాస్ పాత్ర స్కీమ్ లో మొత్తం 124 నెలలు మీ డబ్బులను డిపాజిట్ చేసి ఉంచాల్సి ఉంటుంది. అంటే పది సంవత్సరాల నాలుగు నెలల పాటు మీ డబ్బులను ఫిక్స్ చేసి ఉంచాలి. అప్పుడు మీరు ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే అవి రెండు లక్షల రూపాయలు అవుతాయి.
రైతుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి కిసాన్ వికాస పత్రం అంటూ నామకరణం: ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1988లో ప్రవేశపెట్టింది. ముఖ్యంగా రైతుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి కిసాన్ వికాస పత్రం అంటూ పేరు పెట్టింది. ఇందులో రైతులు మాత్రమే కాదు ఎవరైనా డబ్బు దాచుకోవచ్చు. అయితే కిసాన్ వికాస పత్రం కోసం భారత పౌరులు అయి ఉండాలి. అలాగే వారి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి మైనర్ల తరఫున డిపాజిట్ చేసినట్లయితే వారి తరపున పెద్దలు ఖాతా తెరవాల్సి ఉంటుంది.
కిసాన్ వికాస్ పత్రం వల్ల కలిగే ప్రయోజనాలు: కిసాన్ వికాస్ పత్రం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కిసాన్ వికాస్పత్రిలో డిపాజిటర్లకు ఖచ్చితమైన రాబడి అందుతుంది. అంతేకాదు దీర్ఘకాలంలో ఎలాంటి నష్టాలకు తావు ఉండదు. ఎవరైతే దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వారు ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
చక్రవడ్డీ లభిస్తుంది: ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర పై 6.9% వడ్డీ రేటును నిర్ణయించారు. మీ డిపాజిట్ పై వచ్చే వడ్డీని అసలుకు కలుపుతారు. అంతేకాదు దీనిపై మళ్లీ వడ్డీ వస్తుంది. దీన్నే చక్రవడ్డీ అంటారు. అంటే మీకు తక్కువ మొత్తంలోనే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది.
ఎంతకాలం ఉంచాలి: ఈ స్కీం మొత్తం 124 నెలలపాటు ఉంటుంది. ఇందులో డిపాజిట్ చేసిన 10ఏండ్ల 4 నెలల తర్వాత మీ డిపాజిట్ మొత్తం మెచ్యూర్ అవుతుంది
కిసాన్ వికాస పత్రంలో దాచుకున్న డబ్బులు ముందస్తు ఉపసంహరణ చేసుకోవచ్చు. అయితే మీరు ఎంత కాలం డబ్బు దాచుకున్నారో అంత డబ్బు మాత్రమే ఇందులో లభిస్తుంది. మిగతా మొత్తానికి వడ్డీ లభించదు.
కిసాన్ వికాస్ పత్రంలో కనిష్టంగా 1000 రూపాయల వరకు మదుపు చేయవచ్చు. ఇక గరిష్ట పరిమితి అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. అయితే రూ. 50 వేలకు మించిన డిపాజిట్ ల పై పాన్ కార్డు వివరాలను తెలపాల్సి ఉంటుంది,
కిసాన్ వికాస్ పత్రం జారీ చేసిన డిపాజిట్లపై సర్టిఫికెట్ మీకు అందుతుంది. ఈ సర్టిఫికెట్ ద్వారా మీరు రుణాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు వీటి వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది.