Lucky zodiac signs 2024: ఈ నాలుగు రాశులకు ఇకమీదట రాజయోగమే..డబ్బులే డబ్బులు.. మీ రాశి కూడా ఉందా..?
నవ పంచమ రాజయోగం జ్యోతిషశాస్త్రంలో శక్తివంతమైన యోగాలలో ఒకటి. యోగం ఫలితంగా వివిధ రాశులకు ఆర్థిక బలం చేకూరుతుంది. కుజ, శుక్రుల కలయిక వల్ల నవ పంచమ రాజయోగం కలుగుతుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ముందుగా మేషరాశి.. ఈ రాశి జాతకుల జీవితంపై నవ పంచమ రాజయోగం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్నవారికి ఆ ఉద్యోగం లభిస్తుంది.
కర్కాటకం.. నిలిపివేసిన నిధులు తిరిగి చేకూరుతాయి. కొత్త కారు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం. మీ తండ్రి మద్దతు కూడా మీకు లభిస్తుంది. ముఖ్యంగా సంపద పెరుగుతుంది.
సింహం.. బృహస్పతి , కుజుల కలయిక వల్ల సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తారు. కుటుంబ జీవితం సంతోషాన్ని, శ్రేయస్సును కలిగిస్తుంది.
తులారాశి.. కోరికలు నెరవేరుతాయి. డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరిగి జీవితంలో విజయం చేకూరుతుంది. వివాహ ప్రతిపాదన కూడా వస్తుంది. భార్యాభర్తలకు మద్దతు లభిస్తుంది. ఈ నాలుగు రాశుల వారు ఏదైనా మంచి శుభకార్యం చేపట్టాలనుకున్నప్పుడు ఇదే సరైన సమయం.. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి.