New Year 2025: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన ఆంక్షలు.. రాత్రి 10 దాటితే బంద్..!
ముఖ్యంగా హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్లు పరిధిలో ఈ న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలే విధించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకునే వారు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఈ ఆంక్షలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా న్యూ ఇయర్ అనగానే పార్టీలు, పబ్బులు అంటూ ఎక్కువ శాతం బయటకు వెళ్లి వేడుకలు చేసుకుంటారు. ఇలాంటి వారిపై ఈ ఆంక్షలు.
ముఖ్యంగా న్యూ ఇయర్ పండుగ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ ఔట్‌డోర్‌లో రాత్రి 10 దాటిన తర్వాత లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలి.
న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహిస్తున్నవారు కచ్చితంగా అనుమతి ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పార్టీలు, పబ్బుల్లో మైనారిటీలకు నో ఎంట్రీ లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు.
ఇక పార్టీలు నిర్వహించేటప్పుడు 45 డెసిబుల్స్‌కు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండోర్ మ్యూజికల్ ఈవెంట్స్ నిర్వహించేవారు ఈ నిబంధనలు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర డ్యాన్సులు కూడా నిషిద్ధం. మరీ ముఖ్యంగా డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే భారీగా జరిమానా విధిస్తారు. రూ. 10 వేలు ఫైన్ విధించడంతోపాటు ఆరు నెలలపాటు జైలు శిక్ష కూడా విధిస్తారు.