Hydra: హైదరబాద్ లో కొత్తగా ఇళ్లు, స్థలాలు కొంటున్నారా..?.. కీలక ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ రంగనాథ్.. డిటెయిల్స్ ..
తెలంగాణలో ఎక్కవ చూసిన హైడ్రా హల్ చల్ గురించి పెద్ద చర్చే జరుగుతుంది.సీఎం రేవంత్ రెడ్డి సైతం హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా చెరువులు,ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది.
ఇప్పటికే హైడ్రాలో అనేక ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కూడా జరిగాయి. ఈ క్రమంలో వీకెండ్ వచ్చిందంటే చాలు.. అక్రమ కట్టడాలు నిర్మించుకున్న వారికి కంటి నిండా నిద్ర కూడా ఉండటం లేదు.
మరోవైపు నాగర్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశాక.. హైడ్రా దూకుడుమరింత పెరిగిందని చెప్పవచ్చు. సెలబ్రీటీలైన, రాజకీయ నాయకులై, సామాన్యులైన.. చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడితే హైడ్రా వాటిని కూల్చేస్తుంది.
ఈరోజు మాదాపూర్, శేర్ లింగంపల్లిలోని సున్నం చెరువు వంటి ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి . మరోవైపు మురళిమోహన్ బాబుకు సైతం.. హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్.. కొత్తగా ఇళ్లు, స్థలాలు కొనేవారికి కీలక సూచనలు జారీ చేశారు.
కొత్తగా కొనే ఇళ్లు,స్థలాలు.. బఫర్ జోన్ , ఎప్టీఎల్ పరిధిలో ఉన్నాయా.. లేదా అనేది ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకొవాలని చెప్పారు. అంతేకాకుండా.. పొరపాటున కూడా చెరువుల పరిధిలో అక్రమంగా ఉన్నవాటిని కొనొద్దని రంగనాథ్ చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో చాలా కాలం క్రితం చేపట్టిన నిర్మాణాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
కొత్తగా చేపడుతున్న నిర్మాణాలు కనుక.. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ లెవల్ లో ఉండకుండా చూసుకొవాలని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. హైడ్రా ఎఫెక్ట్ వల్ల కొన్నిరోజులుగా రియల్ ఎస్టేట్ బిజినెస్, రిజిస్ట్రేషన్ లు కూడా భారీగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది.