Hyundai Cars on Discount: కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హ్యూందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్

Thu, 16 Mar 2023-7:34 pm,

Hyundai Aura 2023: హ్యుందాయ్ ఇండియా మోటార్స్ హ్యుందాయ్ ఆరా కారుపై నేరుగా రూ 20,000 క్యాష్ డిస్కౌంట్స్ అందిస్తోంది. అయితే సీఎన్జీ వెర్షన్ కారుకి మాత్రమే ఈ డిస్కౌంట్స్ ఆఫర్ వర్తుస్తుంది అని హ్యుందాయ్ స్పష్టం చేసింది.

Hyundai Aura 2023: ఇదే కాకుండా ఎక్స్‌చేంజ్ బోనస్ కింద అదనంగా మరో రూ 10,000 ఆఫర్ చేస్తోంది. ఈ రెండూ మాత్రమే కాకుండా కార్పొరేట్ పాలసీ కింద కారు కొనేవారికి అదనంగా మరో రూ 3,000 డిస్కౌంట్ లభిస్తోంది  ఇవన్నీ కలిపితే మొత్తం డిస్కౌంట్ వ్యాల్యూ రూ 33 వేలకు చేరుకుంటుంది.

Grand i10 Nios - గ్రాండ్ ఐ10 నియోస్ : హాచ్‌బ్యాక్ కార్లలో ఎక్కువగా సేల్ అవుతున్న కార్లలో ఒకటైన గ్రాండ్ ఐ10 నియోస్‌పై హ్యుందాయ్ మొత్తం రూ 38 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. 

Grand i10 Nios: ఈ మోడల్లో ఇటీవలే డీజిల్ వెర్షన్, టర్బో పెట్రోల్ వెర్షన్ కార్ల తయారీని నిలిపేసిన హ్యుందాయ్ .. ప్రస్తుతం సీఎన్జీ, పెట్రోల్ వెర్షన్స్ మాత్రమే తయారు చేస్తోంది. ఇందులో రూ 25 వేలు డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ కాగా మరో రూ 10,000 క్యాష్ బోనస్ అందిస్తోంది. ఈ రెండింటితో పాటే కార్పొరేట్ సేల్ ఆఫర్ కింద మరో రూ 3,000 అందిస్తోంది.

Hyundai I20 Car - హ్యుందాయ్ ఐ20 : హ్యుందాయ్ ఆఫర్లు అందిస్తోన్న కార్ల జాబితాలో హ్యుందాయ్ ఐ20 కూడా ఉంది. హ్యుందాయ్ ఐ20 కారుపై రూ 10 వేలు క్యాష్ డిస్కౌంట్ అందిస్తుండగా మరో రూ 10 వేలు ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తోంది.

Hyundai I20 Car: అంటే హ్యుందాయ్ ఐ20 కారుపై మొత్తం రూ 20 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోందన్నమాట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link