Smita Sabharwal: స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్.. మండిపడుతున్న అడ్వకేట్స్ , ప్రొఫెసర్ లు.. కారణం ఇదే..
తెలంగాణ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది. స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌పై కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న అధికారిణి ఇలా ట్విట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. యూపీఎస్సీ వంటి అఖిల భారత సర్వీసుల్లోదివ్యాంగులకు రిజర్వేషన్ లు అవసరమా.. అంటూ ఐఏఎస్ స్మితా ట్విట్ చేశారు.
దీంతో ఇది వైరల్ గా మారిపోయింది. స్మితాను సోషల్ మీడియాలో ఎక్కువ మందిఫాలో అవుతుంటారు. మేధావులు, అడ్వకేట్ లు, లాయర్లు, విద్యార్థులు స్మితా పోస్టులను ఎక్కువగా అనుకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో స్మితా ఏకంగా యూపీఎస్సీ ఎగ్జామ్ లలో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా.. అంటూ సంచలన పోస్ట్ పెట్టారు.
దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ నాయకులు, మాజీ అధికారులు, అడ్వకేట్లు, సైక్రియార్టిస్టులు సైతం దీనిపై స్పందించారు. కొందరు నెటిజన్లు స్మితాకు మద్దతు తెలియజేస్తుండగా.. మరికొందరు మాత్రం స్మితా తీరును తప్పుపడుతున్నారు. నెటిజన్లు ట్విట్ లకు కూడా స్మితా గట్టిగానే కౌంటర్ ఇచ్చి తన వాదనను బలపర్చే విధంగా పలు ఉదాహరణలు కూడా పోస్ట్ చేశారు.
సాధారణంగా ఎవరైన.. అంగవైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్స్ లో నియమించుకుంటారా..?... ఒకవేళ ఏదైన వైకల్యం ఉన్న సర్జన్‌ని బాధితులు విశ్వసిస్తారా.? అంటూ స్మితా సబర్వాల్ ప్రశ్నలు సంధించారు.దీనిపై శ్రీకాంత్ మిర్యాల అనే రచయిత, సైకియార్టిస్ట్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో ప్రత్యక్ష ఉదాహరణలతో .. గతంలో ఎంబీబీఎస్ చదివేటప్పుడు తన ప్రిన్సిపాల్ కాలుకి పోలియో సోకి సరిగా నడవలేనివారు, పోలియోసోకిన కూడా ఎడమచేత్తో రాసి, పాఠాలు చెప్పిన వారున్నారు.
ఎంబీబీఎస్ కు పాఠాలు చెప్పే ఒక సర్జన్ కు పుట్టుకతో.. ఒక కాలు పుట్టుకతో పనిచేయలేదని ఆయన కూడా వారంతా రాణిస్తున్నారని చెప్పుకోచ్చాడు. రెండు కాళ్లు లేని ప్రొఫెసర్ ఎన్నోపరిశోధనలు చేసి శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్నిఅందుకున్నాడని చెప్పుకోవచ్చాడు. వీళ్లను పక్కన బెడితే మంచి గురువులను కోల్పోయే వాళ్లమంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.
అంగవైకల్యానికి మేధస్సుకి సంబంధం లేదని,కేవలం మంచి చేయాలనే ఒక తపన ఉంటే వారు సమాజంలో రాణిస్తారని స్మితాకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా.. దీనిపై శివసేన పార్టీ రాజ్యసభ సభ్యురాలు కూడా స్మితా సబర్వాల్ వాదనను వ్యతిరేకించారు.
సుప్రీం కోర్టుకు చెందిన ఒక సీనియర్ న్యాయవాది కూడా తప్పుబట్టారు. ఇలా పలువురు స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా వారి వారి అభిప్రాయాలను తెలుపుతుండగా.. ఒక సర్జన్ మాత్రం ఆమెకు మద్దతు తెలపటం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనలో భాగంగా స్మితా ఈ ట్విట్ చేసినట్లు తెలుస్తోంది. పూజా ఖేడ్కర్ అనేక ఫెక్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఏకంగా యూపీఎస్సీనీ మోసం చేశారు. దీంతో ప్రస్తుతం దేశంలో కొంత మంది యూపీఎస్సీపై కూడా అనుమానాలు వ్యక్తంచేసేదిగా ఘటనమారింది. ఈ నేపథ్యంలో స్మితా చేసినట్విట్ మరో వివాదానికి దారి తీసింది . స్మితా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గా ఉన్నారు.