ICC World Cup 2023 Rescheduled Dates: ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ తేదీలో మార్పులు.. అన్ని మ్యాచ్‌ల కొత్త షెడ్యూల్ ఇదే

Thu, 10 Aug 2023-1:46 pm,

World Cup 2023 New Dates: వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ మారిందంటే ఇండియా, పాకిస్థాన్ దేశాల క్రికెట్ అభిమానులు అంతా ఇండియా vs పాకిస్థాన్ జట్ల మ్యాచ్ ఎప్పుడు జరగనుందా అనే వెతుకుతున్నారు. షెడ్యూల్ మారింది అని చెప్పడం కంటే ఎక్కువగా ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరగనుందా అని చెప్పడమే ఎక్కువగా కనిపించడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 

ICC World Cup 2023 Rescheduled Dates, Pakistan vs Srilanka match new date : బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు అక్టోబర్ 10న హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో తలపడనుంది. ఇదివరకు ఈ మ్యాచ్‌ని అక్టోబర్ 12న షెడ్యూల్ చేసి ఉండగా.. తాజాగా ఆ తేదీని అక్టోబర్ 10 వ తేదీకి మార్చారు.

ICC World Cup 2023 Rescheduled Dates, Australia vs South Africa match new date : న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ జట్ల మధ్య అక్టోబర్ 13న జరగాల్సి ఉన్న మ్యాచ్ అక్టోబర్ 12వ తేదీనే జరగనుంది. 

ICC World Cup 2023 Rescheduled Dates, India vs Pakistan match new date : ఇండియా vs పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న జరగాల్సి ఉన్న మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. యావత్ ప్రపంచం ఎదురుచూసే ఈ క్రీడా సమరం కోసం అహ్మెదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.

ICC World Cup 2023 Rescheduled Dates, India vs Netherlands match new date : ఇండియా vs నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ ని నవంబర్ 11 నుంచి నవంబర్ 12 కి మార్చారు. దీపావళి రోజే బెంగళూరులోని చిన స్వామి స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ICC World Cup 2023 Rescheduled Dates, England vs Pakistan match new date : వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ , పాకిస్థాన్ జట్లకు మధ్య నవంబర్ 12న జరగాల్సిన మ్యాచ్ నవంబర్ 11న జరగనుంది. ఈడెన్ గార్జెన్స్ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 

ICC World Cup 2023 Rescheduled Dates, England vs Bangladesh match new date : డిఫెండింగ్ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ , బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ తేదీలో ఎలాంటి మార్పు లేదు. అదే అక్టోబర్ 10వ తేదీ నాడు డే అండ్ నైట్ జరగాల్సిన మ్యాచ్ పగటి పూర్తి జరగనుంది. అంతే. ఇక ఇందులో ఎలాంటి మార్పు లేదు. ధర్మశాలలోని HPCA స్టేడియంలో ఈ మార్పు జరగనుంది.

ICC World Cup 2023 Rescheduled Dates, England vs Afghanistan match new date : ఇంగ్లాండ్ vs ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 15వ తేదీకి బదులుగా అక్టోబర్ 14వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. 

ICC World Cup 2023 Rescheduled Dates, Australia vs South Africa match new date : ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అక్టోబర్ 13న జరగాల్సి ఉండగా కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 12న జరగనుంది. లక్నోలోని ఎకానా స్టేడియం ఈ మ్యాచ్‌కి వేదిక కానుంది.

ICC World Cup 2023 Rescheduled Dates, Australia vs Bangladesh match new date : ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ జట్ల మధ్య నవంబర్ 12న జరగాల్సి ఉన్న మ్యాచ్ నవంబర్ 11న జరగనుంది. అంటే ఒక్క రోజు ముందుకు ప్రీపోన్ అయింది. పూణెలోని ఎంసిఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link