Team India Squad: టీ20 ప్రపంచకప్ కు 15 మందితో టీమ్ ఇండియా సిద్ధం, ఎవరి బలమెంత

Tue, 30 Apr 2024-8:31 pm,

యశస్వి జైశ్వాల్

22 ఏళ్ల యశస్వి జైశ్వాల్ తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడుతున్నాడు. గత ఏడాది ఈ ఫార్మట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 17 మ్యాచ్‌లు ఆడి 502 పరుగులు చేశాడు. 

విరాట్ కోహ్లీ

టీ20ల్లో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎప్పుడూ బాగుంటుంది. అత్యధిక పరుగులు సాధించింది కూడా ఇతడే. 117 టీ20 మ్యాచ్‌లు ఆడి 4037 పరుగులు సాధించాడు. టీమ్ ఇండియాకు రన్నింగ్ మెషీన్ ఇతడే

సూర్యకుమార్ యాదవ్

టీ20 క్రికెట్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ పేరు ప్రముఖమైంది. 60 టీ20లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 2141 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలున్నాయి. 

సంజూ శామ్సన్

ఐపీఎల్ మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చూపించినందుకు గుర్తింపు లభించింది. టీమ్ ఇండియాకు రెండవ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. కేఎలా రాహుల్, ఇషాన్ కిషన్, దినేష్ కార్తీక్‌లను కాదని సంజూను ఎంపిక చేశారు. 25 టీ20 మ్యాచ్‌లలో 474 పరుగులు చేశాడు. తొలి టీ20 ప్రపంచకప్ ఇది

రోహిత్ శర్మ

2007లో టీ 20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఇప్పటి వరకూ టీమ్ ఇండియా తరపున 151 టీ20లు ఆడి 3974 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలున్నాయి. టీ20 ప్రపంచకప్‌లలో అయితే 39 మ్యాచ్‌లు ఆడి 963 పరుగులు చేశాడు.

రిషభ్ పంత్

టీమ్ ఇండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లలో రిషప్ పంత్ కీలకమైన వ్యక్తి. 2022 లో రోడ్డు ప్రమాదం తరువాత తిరిగి ఇప్పుడే క్రికెట్ ఆడుతున్నాడు. టీమ్ ఇండియా తరపున 66 టీ20 మ్యాచ్‌లు ఆడి 987 పరుగులు చేశాడు. 

రవీంద్ర జడేజా

టీమ్ ఇండియాకు అద్భుతమైన ఆల్ రౌండర్. స్పిన్నర్ కమ్ బ్యాటర్. 66 టీ20లు ఆడి 480 పరుగులు చేశాడు. 53 వికెట్లు పడగొట్టాడు.

హార్దిక్ పాండ్యా

గత ఏడాది వన్డే ప్రపంచకప్ సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా తిరిగి ఇప్పుడు ఐపీఎల్ తో ఎంట్రీ ఇచ్చాడు. టీమ్ ఇండియా తరపున 92 టీ20లు ఆడి 1348 పరుగులు చేశాడు. 73 వికెట్లు పడగొట్టాడు. 

శివమ్ దూబే

ఐపీఎల్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. 21 మ్యాచ్‌లు ఆడి 276 పరుగులు చేశాడు. 8 వికెట్లు కూడా తీసుకున్నాడు.

అర్ధదీప్ సింగ్

పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఆడుతున్న అర్షదీప్ సింగ్ గత టీ20 ప్రపంచకప్ ఆడాడు. 44 టీ20లు ఆడి 66 వికెట్లు పడగొట్టాడు. 

అక్షర్ పటేల్

52 టీ20లు ఆడిన అనుభవముంది. 49 వికెట్లు పడగొట్టాడు. తొలిసారి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. 361 పరుగులు కూడా సాధించాడు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link