Allu Arjun Top Movies List: అల్లు అర్జున్‌ కెరీర్‌లో టాప్ చిత్రాలు.. Part -1

Mon, 08 Apr 2024-2:32 pm,

పుష్ప .. ది రైజ్.. (Pushpa..part -1 The Rise) అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో టైటిల్ రోల్ పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ పరకాయ ప్రవేశం చేసాడు.ఈ సినిమాలో నటనకు జాతీయ స్థాయిలో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి నటుడిగా రికార్డు క్రియేట్ చేసాడు.

అల వైకుంఠపురములో.. (Ala Vaikunthapurramloo) త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు బన్ని కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.

సరైనోడు.. (Sarrainodu) బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా  గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

రుద్రమదేవి.. (Rudramdevi) గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్లో తెరకెక్కిన రుద్రమదేవిలో అల్లు అర్జున్ గోనా గన్నారెడ్డి పాత్రలో మెప్పించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.

సన్నాఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy)

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన మూవీ 'సన్నాఫ్ సత్యమూర్తి'.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది.

రేసు గుర్రం (Race Gurram) అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరెక్కిన మూవీ 'రేసు గుర్రం'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బన్ని కెరీర్‌లో స్పెషల్ మూవీగా నిలిచింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link