Success Story: ఇడ్లీ పిండి అమ్ముతూ రూ.వేలకోట్లకి అధిపతి.. ఈయన సక్సెస్ స్టోరీ విన్నారా..?
ప్రస్తుతం ఉన్న గజిబిజి లైఫ్ స్టైల్ లో ఇడ్లీ, దోస పిండి తయారు చేయాలి అంటే చాలామందికి కుదరడం లేదని, ముఖ్యంగా బ్యాచులర్స్ కి అయితే ఇది మరింత కష్టంగా మారిందని చెప్పవచ్చు. అందుకే ఈ మధ్యకాలంలో ఇడ్లీ, దోశ పిండి కూడా ఆన్లైన్లో ఇన్స్టెంట్ గా దొరుకుతూ బ్యాచిలర్స్ కే కాదు అమ్మలకి కూడా కాస్త రిలీఫ్ అందిస్తున్నాయి పలు కంపెనీలు.
ముఖ్యంగా ఇలాంటి వారి టైమ్ ను ఆధారంగా మార్చుకున్నారు ఒక వ్యక్తి. ఎన్నో ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ , డాక్టర్, ఇంజనీర్, లాయర్ వంటి వృత్తుల వైపు వెళ్లకుండా కాస్త స్మార్ట్ గా ఆలోచించి అందరికీ ఉపయోగపడే ఇడ్లీ , దోశ పిండి అమ్ముతూ నేడు వేలకోట్లకు అధిపతి అయ్యారు. మరి ఇతడి సక్సెస్ స్టోరీ గురించి ఒకసారి మనం చూద్దాం.
ఇడ్లీ, దోశ పిండి అమ్ముతూ ఏకంగా రూ.2 వేల కోట్లు సంపాదించారు ఐడి ఫుడ్ సంస్థ అధినేత ముస్తఫా. రూ.50 వేల పెట్టుబడితో.. ఇడ్లీ, దోశ పిండి తయారు చేసి వాటిని ప్యాకింగ్ చేసి దగ్గరగా ఉన్న 20 షాపులకు సప్లై చేసేవారు. బిజినెస్ మొదలుపెట్టిన ప్రారంభంలో ప్రతి రోజూ 100 ప్యాకెట్లు అమ్మాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. అయితే ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఆయనకు ఏకంగా తొమ్మిది నెలల సమయం పట్టింది.
వ్యాపారాన్ని విస్తరిస్తే ఇంకా అధిక లాభాలు వస్తాయని.. కేరళలో తనకున్న భూమిని కూడా అమ్మేసి కేవలం ఇడ్లీ, వడ, దోశ , ఇన్స్టంట్ పరోటా లను కూడా స్టార్ట్ చేసి ఏకంగా 300 షాప్స్ తో టై అప్ అయ్యాడు. రెస్పాన్స్ బాగుండడంతో..అది చూసి 2017లో విప్రో కంపెనీ అధినేత అయిన అజీమ్ ప్రేమ్ జీ ఏకంగా రూ .170 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు.
అలా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ తో రూ.80 వేల స్క్వేర్ ఫీట్ తో ఒక ఫ్యాక్టరీని స్థాపించి.. ఒక ఇడ్లీ, వడ, దోశ పిండి , ఇన్స్టంట్ పరోటాలు మాత్రమే కాకుండా బ్రెడ్, పాలు, పెరుగు , పన్నీర్ ను కూడా సప్లై చేస్తూ 2023 నాటికి రూ.500 కోట్ల టర్నోవర్ తో ఏకంగా రూ.2 వేల కోట్లకు అధిపతి అయ్యారు ఐడి ఫుడ్ సంస్థ ఓనర్ ముస్తఫా