PM kisan Yojana: పీఎం కిసాన్ రూ.2000 పడలేదా? అయితే వెంటనే ఈ చిన్న పనిచేయండి...
పీఎం కిసాన్ యోజన ద్వారా ప్రతి ఏడాది మూడు విడుదలుగా రూ.2000 డబ్బులను రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జామా చేస్తుంది. అంటే ఏడాదికి రూ.6000 చిన్న సన్నకారు రైతులకు అందుతుంది. ఈ పథకం అర్హతకు రెండు హెక్టార్లు అంతకంటే తక్కువ ఉండే సాగుభూమి ఉన్న రైతులు అర్హులు.
రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2019లో ప్రారంభించింది. జూన్ నెలలో 17వ విడత పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేశారు. కాగా, అక్టోబర్ 5 నిన్న 18వ విడుత డబ్బులను కూడా జమా చేశారు. అయితే, మీ ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన డబ్బులు క్రెడిట్ కాలేదా? ఏం చేయాలి? తెలుసుకుందాం.
పీఎం కిసాన్ డబ్బులు రానివారి కోసం ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారణకు కేంద్రం అర్హులైన లబ్ధిదారుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. pmkisan-ict@gov.in లేదా pmkisan-funds@gov.in కు మెయిల్ పంపించవచ్చు. లేకపోతే టోల్ ఫ్రీ నంబర 1800-15-526 కి కాల్ చేయవచ్చు. సంప్రదించాల్సిన మరో నంబర్ 011-24300606 లేదా 155261
ముఖ్యంగా పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో జమా కావడంలేదు అంటే ముందుగా ఇకేవైసీ పూర్తి చేశారా? తెలుసుకోండి. దీన్ని కేవలం ఇంట్లో కూర్చొని సింపుల్‌గా చేసుకోవచ్చు. రిజిస్టర్ మొబైల్ నంబర్ ఆధార్ నంబర్‌తో ఈ పని పూర్తవుతుంది. ఓటీపీ రిజిస్టర్ నంబర్‌కు వస్తుంది. తద్వారా ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు.లేదంటే దగ్గరలోని సీఎస్‌సీకి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు.
అంతేకాదు ఇంట్లో నుంచి సింపుల్‌గా పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisn.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. దీనికి రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉండాలి. దీనికి ఓటీపీ వస్తుంది. తద్వారా బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.