Pension:ఈ స్కీములో చేరినట్లయితే..మీకు రిటైర్మెంట్ తర్వాత రెండు లక్షల పెన్షన్ లభించడం పక్కా
Pension Scheme: రిటైర్మెంట్ తర్వాత జీవితం ఆనందంగా సుఖంగా గడపాలంటే..ఉద్యోగం చేస్తున్న సమయంలోనే సేవింగ్స్ చేయడం మొదలు పెట్టుకోవాలి. ప్రస్తుతం 35 ఏళ్లు నిండి రిటైర్మెంట్ ఫండ్ ఎక్కువగా పోగు చేయాలని భావిస్తే ఎలాంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు చూద్దాం.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ కోసం అత్యంత ప్రజాదరణ పొందిన స్కీము ఇది. ఈక్వీటీలు, కార్పొరేట్ డెట్స్, ప్రభుత్వ బాండ్స్ లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా నిలించింది. ఎన్పీఎస్ లో చేరితే రిటైర్మెంట్ తర్వాత నెలకు 2లక్షల వరకు సంపాదించుకోవచ్చు.
ప్రస్తుతం 35ఏళ్ల వ్యక్తి రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 2లక్షల పెన్షన్ పొందడానికి 2.77 కోట్ల ఎన్పీఎస్ కార్పస్ ఉండాలి. రూల్స్ ప్రకారం ఉపసంహరణ సమయంలో యాన్యుటీని కొనుగోలు చేయడానికి మీ కార్పస్ లో 40శాతం తప్పనసరిగా పెట్టుబడి పెట్టాలి. అలా రిటైర్మెంట్ సమయంలో యాన్యుటీని కొనుగోలు చేసేందుకు రూ. 1.11కోట్లు అవుతుంది. మీరు 60ఏళ్లు వచ్చినా రూ. 1.66 కోట్లు మీ దగ్గర ఉంటాయి.
మొత్తం ఎన్పీఎస్ కార్పస్ లో 40శాతం లేదా రూ. 1.11 కోట్లను ఏడాదికి 6శాతం వడ్డీ వస్తే..నెలకు రూ. 60, 648 పెన్షన్ లభిస్తుంది. అదేవిధంగా బ్యాలెన్స్ డ్ హైబ్రిడ్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ లో 1.66 కోట్లు ఉంటాయి.
ఈ మొత్తం 10శాతం వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తుంది. నెలకు రూ. 1,39,993 వస్తాయి. ఇలా రిటైర్మెంట్ సమయంలో మొత్తంగా చూస్తే నెలకు రూ. 2,00, 581 పెన్షన్ లభిస్తుంది. దీనికి 35ఏళ్లలో పెట్టుబడిని ప్రారంభించిన వ్యక్తి వచ్చే 25ఏళ్ల వరకు నెలకు 20,700 ఎన్పీఎస్ లో పెట్టుబడి పెట్టాలి.
రిటైర్మెంట్ సమయంలో రూ. 1లక్ష కంటే తక్కువ నెలవారీ ఆదాయం కావాలనుకుంటే రూ. 1.38కోట్ల ఎన్పీఎస్ కార్పస్ సరిపోతుంది. అలాగే 25ఏళ్ల పాటు ఎన్పీఎస్ లో నెలకు రూ. 10,350 పెట్టుబడి పెడితే ఈ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.
రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్ నుంచి పొందే పెన్షన్ సేకరించిన కార్పస్ మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. పెట్టుబడిని ప్రారంభించే ముందు ఎన్పీఎస్ విత్ డ్రా రూల్స్ తెలుసుకోవాలి. ఈ స్కీములో చిన్న మొత్తంతో ప్రారంభించి పెట్టుబడి మొత్తాన్ని క్రమంగా పెంచుకోవచ్చు.