Indian railways: మీ ఫోన్ రన్నింగ్ ట్రైన్‌లో నుంచి పడిపోయిందా..?.. ఈ ఒక్క పనిచేస్తే పోలీసులే తెచ్చిస్తారంట..
చాలా మంది లాంగ్ జర్నీస్ చేసేందుకు ఎక్కువగా ట్రైన్ లలో వెళ్లుంటారు. రైలు జర్నీలో ఎంజాయ్ చేస్తు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.
అదే సమయంలో ట్రైన్ లలో కొందరు బుక్స్ చదువుకుంటారు. మరికొందరు ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తుంటారు. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్ లలో కొందరు కిటికీల దగ్గర లేదా ట్రైన్ ఎక్కే డోర్ వద్ద ఉండి ఫోటోలు దిగుతుంటారు.
మరికొందరు ఫోన్ల లో మాట్లాడుతుంటారు.ఈ నేపథ్యంలో కొన్ని సార్లు ఫోన్ జారీ పోయి పట్టాల మీద పడిపోతుంటుంది. అప్పుడు ఏంచేయాలో తెలీక చాలా మంది తలలు పట్టుకుంటారు.
అలాంటి సమయంలో ఫోన్ ఎక్కడ పడిపోయిందో.. అక్కడ ట్రైన్ పోల్స్ ఉంటాయి.. ఆ స్తంభం మీద ఉన్న నెంబర్ ను నోట్ చేసుకొవాలి. ఈ స్తంభాల మీద ఉన్న నంబర్ లను నోట్ చేసుకుని వెంటనే రైలు ప్రయాణికుల హెల్ప్ లైన్ నంబర్ 132కు సమాచారం ఇవ్వాలి.
ట్రైన్ ఆర్పీఎఫ్ సెక్యురిటీ ఫోన్ నంబర్ లు 182 కు కాల్ చేసి ఆ స్తంభం నెంబర్ లేదా పోల్ నంబర్ లను వారికి ఇస్తే.. వారు వెంటనే ఆ పరిధిలోనీ జీఆర్పీ పోలీసులను అలర్ట్ చేస్తారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి మీ ఫోన్ ను స్వాధీనం చేసుకుంటారు.
దీనితో మీ ఫోన్ అనేది ఇతరులకు దొరక్కుండా.. మీరు ఈ సింపుల్ రూల్స్ ఫాలో అయితే మాత్రం మీ ఫోన్ రైల్లో నుంచి పడిపోయిన కూడా మరల పొందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెప్పుకొవచ్చు.