IMD Alert: ఉపరితల ఆవర్తనం.. ఈ 4 జిల్లాల్లో భారీవర్షాలు, ఐఎండీ హెచ్చరిక..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
ఇక తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది.
ఉపరితల ఆవర్తనం కారణంగా తిరుపతి, చిత్తూరు, గుంటూరు, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తారు వర్షాలు రానున్న రెండు రోజులు కురువనున్నాయి.
డిసెంబర్ నెలలో కూడా ఈ భారీవర్షాలు కురవనున్నాయి. అంతేకాదు ఈనెలలో తుఫాను హెచ్చరికలు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఎక్కువ శాతం తుఫానులు ఈ నెలలోనే చోటు చేసుకుంటాయి.