India Economy: ఎవడొస్తాడో రండ్రా.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా దూకుడు.. చెప్పింది ఎవరో తెలుసా?
India Economy: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత్ గురించి మరోసారి సంచలన ప్రకటన చేసింది . ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, దేశ ఆర్థిక మూలాధారాలు బాగున్నాయని తన నివేదికలో పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని ఐఎంఎఫ్‌లోని ఆసియా పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ అన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏడు శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పంటలు అనుకూలంగా ఉన్నందున గ్రామీణ వినియోగంలో రికవరీ మద్దతు ఉందని.. కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ఆహార ధరల సాధారణీకరణ కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేశారు. ఇతర ఫండమెంటల్స్ పరంగా, ఎన్నికలు జరిగినప్పటికీ ఆర్థిక ఏకీకరణ ట్రాక్‌లోనే ఉందని ఆయన అన్నారు. 'రిజర్వ్' పరిస్థితి చాలా బాగుందని.. మాక్రో ఫండమెంటల్స్ సాధారణంగా భారతదేశానికి మంచివని ఆయన అన్నారు.
2047నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లకు పెరుగనున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే వేగవంతమైన జనాభాతో దేశం ప్రాథమిక సేవా అవసరాలను తీర్చడంతోపాటు ఉత్పాదకతను కొనసాగించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎస్ అండ్ పి విడుదల చేసిన లుక్ ఫార్వర్డ్ ఎమర్జింగ్ మార్కెట్స్ రిపోర్టు ప్రకారం రానున్న మూడేళ్లలో అత్యంత వేగంగా భారత్ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోయే అవకాశం ఉందన్నారు. వచ్చే దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపొందించడంలో భారత్ సహా అభివ్రుద్ధి చెందుతూన్న మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.
ఎస్ అండ్ పి అభిప్రాయం ప్రకారం అభివృద్ధి చెందుతోన్న మార్కెట్లు 2035 నాటికి సగటున 4.06శాతం జీడీపీ వ్రుద్ధిని సాధిస్తాయని అంచనా వేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధిలో సుమారు 65వాతం వాటాను కలిగి ఉండనున్నాయి. రానున్న రోజుల్లో భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే ఈ తరుణంలో వేగంగా పెరుగుతోన్న జనాభా దీనికి ప్రతిబంధకంగా మారే ఛాన్స్ ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక పునరుత్పాదక ఇంధన అభిృద్ధిలో పురోగతిలో ఉన్నప్పటికీ..భారత్ ఆర్థిక వృద్ధి ఆటోమొబైల్స్ వంటి కార్బన్ ఇంటెన్సివ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడానికి కారణం అవుతుందని మూడిస్ రేటింగ్స్ పేర్కొంది. 2024లో భారత్ జీడీ 7.2 శాతం 2025 నాటికి 6.6 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.