Immunity System: రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని తేలిపే 7 సంకేతాలు ఇవే!
రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది: ఇది మన శరీరంలో విదేశీ బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. అలాగే హానికరమైన వైరస్‌లను తొలగించడంలో కీలక ప్రాత పోషిస్తుంద.
రోగనిరోధక శక్తి కొన్ని సార్లు బలహీనపడినప్పుడు కొన్ని సంకేతాలను మనం గుర్తించవచ్చు.
తరచుగా జలుబు, ఫ్లూ లేదా ఇతర అనారోగ్యాలు: చిన్న చిన్న అనారోగ్యాలకు గురవుతూ ఉంటే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండే అవకాశం ఉంది.
గాయాలు: రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు చిన్న గాయాలు కూడా నెమ్మదిగా మానుతాయి.
అలసట: ఎంత నిద్రపోయినా అలసటగా అనిపిస్తే, ఇది రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న సంకేతం కావచ్చు.
జీర్ణ సమస్యలు: మలబద్ధకం, అతిసారం లేదా ఇతర జీర్ణ సమస్యలు రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న సంకేతాలు కావచ్చు.
జుట్టు రాలడం: అకస్మాత్తుగా ఎక్కువగా జుట్టు రాలడం రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న సంకేతం కావచ్చు.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: పండ్లు, కూరగాయలు, గింజలో పోషక విలువలు కలిగిన ఆహారాలను తీసుకోండి.
వ్యాయామం చేయండి: వారానికి కనీసం 150 నిమిషాలు మధ్యస్థ తీవ్రతతో వ్యాయామం చేయండి.
గమనిక: ఈ సమాచారం వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి ఆందోళన చెందుతుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.