Ind Vs WI Records: అనిల్ కుంబ్లే తెగింపు.. విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ.. విండీస్‌పై గుర్తుండిపోయే క్షణాలు

Tue, 11 Jul 2023-8:25 pm,

దివంగత అజిత్ వాడేకర్ సారథ్యంలోని టీమిండియా 1971లో వెస్టిండీస్ పర్యటనలో చరిత్ర సృష్టించింది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0తో వెస్టిండీస్‌ను ఓడించింది.   

ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో 1997లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 201 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.   

2002 పర్యటనలో టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మార్వ్ డిల్లాన్ వేసిన డెలివరీ హెల్మెట్‌కు తగిలింది. కుంబ్లే దవడకు తీవ్ర గాయమైనా పట్టువదల్లేదు. విరామ సమయంలో కట్టుకుని మరీ వచ్చి బౌలింగ్ చేశాడు. విండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ బ్రియాన్ లారాను కూడా అవుట్ చేశాడు.  

2006లో ఆంటిగ్వాలోని సెయింట్ జాన్స్‌లో వెస్టిండీస్‌పై మాజీ ఓపెనర్ వసీం జాఫర్ డబుల్ సెంచరీ సాధించాడు. జాఫర్ 212 పరుగులు చేయడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 130 పరుగులు వెనుకబడిన భారత్.. తరువాత అద్భుతంగా పుంజుకుని విజయాన్ని సాధించింది.   

విరాట్ కోహ్లి 2016లో ఆంటిగ్వాలో వెస్టిండీస్‌పై టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి డబుల్ సెంచరీ (200) సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో గెలుపొందింది.   

ఆగస్ట్ 2019లో జమైకాలోని కింగ్‌స్టన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 117 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన (6/27) బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, రోస్టన్ చేజ్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link