Independence Day 2024: ఇండిపెండెన్స్ డే విస్తారా బంపర్ ఆఫర్.. రూ. 1,578 లకే విమాన ప్రయాణం.. డిటెయిల్స్ ఇవే..

Mon, 12 Aug 2024-4:07 pm,

సాధారణంగా చాలా మంది విమానంలో జర్నీ చేయాలనుకుంటారు. కానీ చార్జీలు అధికంగా ఉంటాయని,తమ కోరికలను వాయిదాలు వేస్తుంటారు. మరికొందరు మాత్రం విమానంలో  జర్నీలు చేయాలంటే భయపడిపోతుంటారు. వీరికి భిన్నంగా మరికొందరు తమకు నచ్చిన విధంగా, ఎప్పుడు చాన్స్ దొరికితే అప్పుడు విమానంలో జర్నీలు చేస్తుంటారు.  

ఈ నేపథ్యంలో విస్తారా ఎయిర్ లైన్స్.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా..  అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించిన బుక్కింగ్స్ కూడా ప్రారంభమయ్మాయి. ఈ ప్రత్యేకమైన ఆఫర్ ద్వారా..ఈ ఫ్రీడమ్ సేల్ ద్వారా వన్-వే దేశీయ మార్గంలో కనీస విమాన టికెట్ ధర రూ. 1578 గా నిర్ణయించింది. ఇది ఎకనామీ క్లాస్‌కు వర్తిస్తుంది. అదే ప్రీమియం ఎకనామీ అయితే కనీస టికెట్ ధర రూ. 2,678 గా ఉంది. అలాగే బిజినెస్ క్లాస్ కనీస టికెట్ ధర రూ. 9,978కే అందిస్తోంది.  

దేశీయ వన్-వే ఛార్జీలు బాగ్డోగ్రా నుంచి డిబ్రూఘర్‌కు ప్రయాణించడానికి ఎకానమీ క్లాస్‌కు ₹ 1,578 , ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు ₹ 2,678, ముంబై నుండి అహ్మదాబాద్‌కు బిజినెస్ క్లాస్‌కు ₹ 9,978 నుండి ప్రారంభమవుతుంది .  

ఢిల్లీ నుంచి ఖాట్మండుకు వెళ్లే విమానాల కోసం ఎకానమీ క్లాస్ కోసం అంతర్జాతీయ రిటర్న్ అన్నీ కలిపిన ఛార్జీలు ₹ 11,978 నుండి ప్రారంభమవుతాయి . ప్రీమియం ఎకానమీ శ్రేణిలో, ఢిల్లీ నుండి ఖాట్మండుకు ₹ 13,978 నుండి ఛార్జీలు ప్రారంభమవుతాయి. అదే గమ్యస్థానానికి వ్యాపార తరగతికి ₹ 46,978 నుండి చార్జీలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.  

ఈ ధరల్లోనే అన్ని ట్యాక్సులు ఉంటాయని తెలుస్తోంది. ఆగస్టు 15 వ తేదీలోపు బుక్ చేసుకుని అక్టోబర్ 31, 2024 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది.ఈ విస్తారా ఎయిర్ లైన్స్ ఆఫర్ తగ్గింపును పొందేందుకు, కస్టమర్‌లు అక్టోబర్ 31 వరకు ప్రయాణించడానికి ఆగస్టు 15న 23:59 గంటలలోపు తమ టిక్కెట్‌లను బుక్ చేసుకోవాలి.   

ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్, www.airvistara.com , విస్తారా యొక్క iOS, Android మొబైల్ యాప్‌లు రెండింటిలోనూ, Vistara యొక్క ఎయిర్‌పోర్ట్ టిక్కెట్ ఆఫీసులలో (ATOలు), విస్తారా యొక్క కాల్ సెంటర్‌లు, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలు (OTAలు)  ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link