India Future Space Missions: రానున్న ఐదేళ్లలో ఇస్రో చేపట్టనున్నస్పేస్ ప్రాజెక్టులు ఇవే

Wed, 19 Jun 2024-7:46 pm,

శుక్రయాన్ మిషన్ 1

వచ్చే ఏడాది శుక్రుడినిపై అధ్యయనం కోసం శుక్రయాన్ 1 ప్రాజెక్టు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి ఇదొక ఆర్బిటర్. శుక్రుని చుట్టూ తిరుగుతూ వాయుమండలం, అంతరిక్షం సమాచారం సేకరిస్తుంది. 

NISAR Mission

అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా, భారత స్పేస్ ఏజెన్సీ ఇస్రో కలిసి ఈ ఏడాది నిసార్ మిషన్ లాంచ్ చేయనున్నాయి. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. అడ్వాన్స్డ్ రాడార్ టెక్నాలజీ సహాయంతో ఈ మిషన్ భూమిపై పరిస్థితులు,  మంచు పరిస్తితి , ప్రకృతి విపత్తులను అధ్యయనం చేస్తుంది. జలవాయు మార్పుల్ని అర్ధం చేసుకుని సూచనలు ఇవ్వడంలో ఉపయోగపడుతుంది.

చంద్రయాన్ 4 మిషన్

చంద్రయాన్ 3 విజయవంతం తరువాత అంతరిక్షంలో భారత్ పేరు మార్మోగిపోయింది. 2028లో చంద్రయాన్ 4 చేపట్టేందుకు సిద్ధమౌతోంది. ఇస్రో ఈ మిషన్ ద్వారా చంద్రుని నుంచి శాంపిల్ తీసుకురావచ్చు. అంటే చంద్రయాన్ 4 కేవలం చంద్రునిపై అడుగుపెట్టడమే కాకుండా అక్కడ్నించి శాంపిల్ సేకరించి వాటిని విశ్లేషించి ఆ డేటాను భూమికి పంపిస్తుంది. 

మంగళయాన్ 2 మిషన్

మంగళయాన్ 1 సక్సెస్ తరువాత 2026లో ఇస్రో మంగళయాన్ 2 చేపట్టనుంది. మంగళగ్రహం గురించి సమాచారం తెలియనుంది. ఈ మి,న్ ఉద్దేశ్యం మంగళ గ్రహం కక్ష్య, వాయు మండలం గురించి సమాచారం తెలుసుకోవడం. 

నాసా ఆర్టిమిస్ మిషన్

నాసా ఆర్టిమిస్ మిషన్‌లో ఇండియా భాగస్వామ్యం కానుంది. ఈ మిషన్ ద్వారా మనిషి రెండోసారి చంద్రునిపై పంపించే ఏర్పాట్లు చేస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link