Beautiful Temples: ఇండియాలోని అందమైన ఏడు ఆలయాలివే
తమిళనాడులోని బృహదేశ్వరాలయం ఇది. ఈ మందిరం యూనెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. తమిళ ఆర్కిటెక్చర్‌కు ఇదొక నమూనా.
మధుర మీనాక్షి ఆలయం. తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి ఆలయం చాలా ప్రాచుర్యమైంది. మీనాక్షి దేవి అంటే పార్వతీ దేవికి ప్రతిరూపంగా పిలుస్తారు. ఈ ఆలయం కూడా చారిత్రక ప్రాధాన్యత కలిగింది. అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయం సొంతం.
అక్షరధామ్ ఆలయం. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఈ ఆలయాన్ని 2005లో నిర్మించడం పూర్తయింది. ఈ నిర్మాణం ఎటు నుంచి చూసినా చాలా అద్బుతంగా ఉంటుంది.
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నది తీరాన వెలసిన ఈ ఆలయం కాళికాదేవి ఆలయం. దక్షిణేశ్వరాలయంగా ప్రసిద్ధి పొందింది.
ఢిల్లీలోని లోటస్ టెంపుల్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. బహాయి మతం అనుసరించేవారికి ఇది ఓ ఆలయం. 1986లో నిర్మించారు. ఈ ఆలయం అందమే పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటుంది.
సిక్కులకు పవిత్రమైంది ఈ ఆలయం. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్. 1577లో నిర్మించిన ఆలయం ఇది. సిక్కులకు ఓ పవిత్రమైన, ఆధ్యాత్మికమైన ప్రాంతమిది.