Indian Air Force: చైనా-పాక్‌కు దీటైన సమాధానమిచ్చే వాయుసేన అభ్యాసనం ప్రారంభం
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైందిగా భావించే ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌కు చెందిన రెండు స్క్వాడ్రన్లను చైనా వైమానిక స్థావరాలు లక్ష్యంగా చేసుకునే ప్రాంతాల్లో మొహరించారు.
చైనా గత మూడేళ్లలో టిబెట్‌లో తన ఎయిర్‌ఫోర్స్ దళాలను బలోపేతం చేసింది. కొత్త ఎయిర్‌బేస్, హెలీపోర్ట్ నిర్మించింది. పాత ఎయిర్‌బేస్ సామర్ధ్యాన్ని పెంచింది. ఇండియా కూడా బోర్డర్‌లో తన సామర్ధ్యాన్ని పెంచింది.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గత ఏడాది రాఫెల్, సుఖోయ్ జెట్స్ నుంచి వేలాది కిలోమీటర్ల ఎత్తులో హిందూ మహాసముద్రంలో దాడి చేసే విన్యాసాలు నిర్వహించింది.
పోక్రాన్‌లో ప్రత్యర్దికి చెందిన వేర్వేరు స్థావరాలపై దాడి చేసేందుకు వేర్వేరు రకాల ఆయుధాలను ఉపయోగించారు. ఇప్పుడు నిర్వహిస్తున్న గగన్‌శక్తి స్తాయిలో ఈ వాయు శక్తి జరగలేదు. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరో అభ్యయనం చేయనుంది.
అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల వాతావరణంలో యుద్ధం చేసే సామర్ధ్యం కలిగి ఉండేందుకు ఈ అభ్యయనం నిర్వహిస్తోంది. ఫిబ్రవరిలో పోక్రాన్‌లో వాయ శక్తి అభ్యయనం నిర్వహించింది. ఇందులో ప్రత్యర్ధిపై యుద్ధం చేసే సామర్ధ్యంతో ప్రదర్శన జరిగింది. ఇందులో రాఫెల్, మిస్సైల్స్ కూడా ఉపయోగించారు.
ఏప్రిల్ 1 అంటే ఇవాళ్టి నుంచి పదిరోజులు ఏప్రిల్ 10 వరకూ గగన్‌శక్తి 2024 ద్వారా ఒకేసారి రెండు యుద్ధాలు చైనా, పాకిస్తాన్‌ను తట్టుకునేలా విన్యాసాలు ప్రారంభించింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అన్ని ఫైటర్ జెట్స్, విమానాలు, హెలీక్రాఫ్ట్స్ , ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, , రాడార్ స్టేషన్, మిస్లైల్ బేస్ పాల్గొంటాయి. రాఫెల్, లడాకూ హెలీక్రాఫ్ట్ , అపాచీ కూడా పాల్గొనబోతున్నాయి.