Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
అవసరం అయిన వారికి వ్యాక్సిన్ అందుబాటులో తేవడానికి ప్రభుత్వం ఒక యాప్ క్రియేట్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వివరాలు వెల్లడించారు.
కోవిడ్-19 Covid-19) వ్యాక్సిన్ కోసం కొత్తగా ప్రవేశ పెట్టిన Co-Win యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు.
ఈ యాప్ Electronic Vaccine Intelligence Network (eVIN) వర్షన్ తెలిపారు. వ్యాక్సిన్ వినిగియోగించుకోవాలి అనుకునే వారికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది అని తెలిపారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక అడ్మినిస్ట్రేటర్లు, వ్యాక్సినేటర్లు, వ్యాక్సిన్ తీసుకునే వాళ్లు ఆ యాప్ వల్ల ప్రయోజనం పొందవచ్చు అన్నారు.
ప్రస్తుతం దేశంలో అత్యవసరంగా వ్యాక్సిన్ అవసరం ఉన్నవారి జాబితా సిద్ధంగా కేంద్రం వద్ద ఉంది.
ముందుగా ఆరోగ్య కార్యకర్తలు, రెండో స్టేజ్‌లో ఎమర్జెన్సీ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తారు.
దాంతో పాటు మూడో దశలో కరోనావైరస్ (Coronavirus) ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఫస్ట్ స్టేజ్‌లో మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తాం అన్నారు.