Indian Railway Facts: రైలు ధర ఎంతో తెలుసా..! ఒక కోచ్ తయారీ ఖర్చు ఎంతంటే..?
మన రైల్వేలోని ప్రతి రైలులో వివిధ సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి ట్రైన్ డిఫరెంట్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర కోచ్‌ను బట్టి.. సౌకర్యాలను బట్టి మారుతుటుంది. జనరల్ బోగీ, స్లీపర్, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌ల తయారీకి వేర్వేరుగా ఖర్చు అవుతుంది.
ట్రైన్ ఇంజిన్ అత్యంత ఖరీదైనది. ఇంజిన్ తయారీకి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మన రైళ్లలో రెండు రకాల ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో విద్యుత్‌తో నడిచే ఇంజిన్లు కొన్ని ఉంటే.. మరికొన్ని డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ఒక్కో ఇంజిన్ తయారికీ రూ.13 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుంది.
ఒక రైల్వే కోచ్‌ను రెడీ చేయడానికి సగటున రూ.2 కోట్లు ఖర్చవుతుంది. అయితే కోచ్‌లో కల్పించే సౌకర్యాలను బట్టి ధర ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణ కంపార్ట్‌మెంట్‌ను రెడీ చేయడానికి కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. ఇందులో సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. ఏసీ కోచ్‌లో ఎక్కువ వసతులు కల్పించాల్సి ఉండడంతో తయారీకి ఖర్చు అవుతుంది.
మొత్తం రైలు నిర్మాణానికి దాదాపు రూ.66 కోట్లు ఖర్చవుతుంది. ప్యాసింజర్ రైలులో దాదాపు 24 బోగీలు ఉంటే.. ఒక్కో బోగీకి సగటున రూ.2 కోట్లు ఖర్చవుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకు రూ.48 కోట్లు అయితే.. రైలు ఇంజిన్ ధర సగటున రూ.18 కోట్లు ఉంటుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును తయారు చేసేందుకు మరింత ఎక్కువగా ఖర్చవుతుంది. సగటున 115 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.