Indian Railways: ఐఆర్‌సీటీసీలో కీలక మార్పు.. అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు 60 రోజులకు తగ్గింపు..!

Thu, 17 Oct 2024-5:58 pm,

Railways Advance Ticket Booking Period: రైల్వే అడ్వాన్స్‌ టిక్కెట్‌ బుకింగ్‌ మార్పు గురించి రైల్వే బోర్డు డైరెక్టర్‌ సంజయ్‌ మనోచా మాట్లాడుతూ రైల్వే అడ్వాన్స్‌ బుకింగ్‌  అక్టోబర్‌ 31వ తేదీ వరకు యథావిధిగా కొనసాగుతుంది. ఆ మరుసటి రోజు నవంబర్‌ 1వ తేదీ నుంచి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ 60 రోజులకు మించి ఉండదని స్పష్టం చేశారు.  

కానీ, విదేశీ పర్యాటకులకు 365 రోజుల బుకింగ్‌ గడువులో ఎలాంటి మార్పు చేయలేదన్నారు. ఇక పగటి పూట ప్రయాణించే తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌, గోమతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల బుకింగ్స్‌లో కూడా ఎలాంటి మార్పులు ఉండవన్నారు.  

పండుగలు, పరీక్షలకు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు గతంలో నాలుగు నెలల ముందు రిజర్వేషన్‌ చేసుకునేవారు. కానీ, ఇప్పుడు ఈ గడువు కేవలం రెండు నెలలకు తగ్గించినట్లు మనోచా చెప్పారు. ఇక ఎక్కువ రోజులు వేచి ఉండుండా కేవలం రెండు నెలలకు ముందు టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు.  

ఈ కొత్త రూల్‌ ప్రకారం మీరు ఒక వేళ 2025 మే 1వ తేదీ రైలు ప్రయాణం చేయాలంటే గతంలో 120 రోజుల ముందు అంటే 2025 జనవరి 1వ తేదీన బుక్‌ చేసుకోవాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు కేవలం 60 రోజుల ముందు అంటే మీరు 2025 మార్చి 2వ తేదీ బుక్‌ చేసుకుంటే సరిపోతుంది.  

కొత్త రూల్‌ నిత్యం ప్రయాణించే లక్షల మంది ఇండియన్‌ రైల్వే ప్రయాణీకులకు భారీ ఉపశమనం లభిస్తుంది. నాలుగు నెలలకు ముందుగా బుక్‌ చేసుకునే రైలు టిక్కెట్లు ఇక ఎంచక్కా రెండు నెలల మందు బుక్‌ చేసుకుంటే సరిపోతుంది. దీంతో టిక్కెట్‌ క్యాన్సలింగ్‌ కూడా కొన్ని తగ్గవచ్చు.  

అంతేకాదు గతంలో నాలుగు నెలల ముందు రైలు టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే కొన్ని కారణాలు, విపత్తుల సమయంలో రైళ్లు కూడా రద్దు అయ్యేవి. దీంతో ప్రయాణీకుల ప్లానింగ్‌ కూడా బెడిసి కొట్టేది. దీంతో అతడికి రైలు ప్రయాణం చేయాలంటేనే చిరాకు కూడా వచ్చేది.   

ఎక్కువ శాతం మంచి ప్రయాణీకులు 45 రోజులు ముందుగా రైలు టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటున్నారు. కేవలం 13 శాతం మంది మాత్రమే 120 రోజుల ముందు బుక్‌ చేసుకుంటున్నారు. దీంతో వారు టిక్కెట్‌ క్యాన్సలింగ్, రీఫండ్‌ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని రైల్వే శాఖ తెలిపింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link