అలా చేస్తే.. రూ.5,000 వరకు జరిమానా
తరచుగా రైలులో ప్రయాణించే వారు ఏ ఇబ్బందీ పడకుండా ఉండాలంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. లేదంటే నేరం తీవ్రతనుబట్టి రూ.100 నుంచి రూ.5,000 వరకు జేబుకు చిల్లుపడే ప్రమాదం లేకపోలేదు. అందుకు కారణం ఈస్ట్ కోస్ట్ రైల్వే (East Coast Railway) ఇవాళ్టి నుంచే జరిమానాలను రెట్టింపు చేయడమే. అవును.. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించడంతో పాటు నాణ్యమైన సేవలు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో కానీ లేదా రైలులో కానీ ఉమ్మివేయడం, బహిరంగ మలమూత్ర విసర్జనం, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి నేరాలకు భారీ మూల్యాన్ని చెల్లించుకోకతప్పదని ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పష్టంచేసింది. (PTI Photo)
కొన్ని నేరాలకు జరిమానాలను 100 శాతం పెంచుతూ ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయం తీసుకోవడం చూస్తే... పరిశుభ్రత అంశాన్ని ECOR ఎంత సీరియస్‌గా తీసుకుందో ఇట్టే అర్థమవుతోంది. (PTI photo)
జరిమానాలు కేవలం ప్రయాణికులకే కాదు.. రైల్వే స్టేషన్స్, రైలులో వివిధ రకాల సేవలు అందించే వారికి, ఉత్పత్తులు అమ్ముకునే వెండార్స్‌కి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం వంటి నిబంధనలను అతిక్రమించిన వెండార్స్‌పైనా జరిమానా విధించనున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. (Reuters)
తప్పు చేస్తుంటే చూసే వాళ్లెవరు.. జరిమానా విధించే వాళ్లెవరు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది (RPF staff), స్టేషన్ మాస్టర్స్, టికెట్ కలెక్టర్స్ (Ticket collectors)తో పాటు రైల్వే అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్ (Khurda Road), సంబల్‌పూర్ (Sambalpur), వాల్తేరు ( Waltair) డివిజన్లలో ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. (PTI Photo)